
BJP manifesto: బీజేపీ మేనిఫెస్టో.. ఏడాదికి ఉచితంగా నాలుగు సిలిండర్లు.. కీలక హామీలు ఇవే
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ ఎన్నికల కోసం బీజేపీ మానిఫెస్టోను శనివారం కేంద్రహోంమంత్రి అమిత్‌షా శనివారం విడుదల చేశారు.
హైదరాబాద్ నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో 'మన మోదీ గ్యారంంటీ.. బీజేపీ భరోసా' పేరుతో మేనిఫెస్టోను అమిత్ షా ఆవిష్కరించారు.
బీజేపీ తమ మేనిఫెస్టోను అన్ని వర్గాలను ఆకర్షించేలా రూపొందించింది.
మేనిఫెస్టోలోని కీలక హామీలు ఇవే..
ఉజ్వల పథకం లబ్ధిదారులకు ఏడాదికి నాలుగు సిలిండర్లు ఉచితం
ధరణి బదులుగా మీ భూమి' యాప్
తెలంగాణలో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుకు నోడల్ మంత్రిత్వ శాఖ ఏర్పాటు
రాష్ట్రంలో డీజిల్, పెట్రోల్ వ్యాట్ తగ్గింపు
కేసీఆర్ సర్కారు చేసిన కుంభకోణాలపై విచారణ కమిటీ ఏర్పాటు
గల్ఫ్ బాధితులకు ప్రత్యేక నోడల్ విభాగం
మేనిఫెస్టో
రైతులపై హామీ వర్షం
వరి మద్దతు ధర రూ.3,100
రైతులకు ఉచితంగా దేశీ ఆవులు పంపిణీ
ఎరువులు, విత్తనాలు కొనుగోలకు ఇన్‌పుట్ సహాయం రూ.2,500
మత ప్రతిపాదికన ఇస్తున్న రిజర్వేషన్ల తొలగింపు..
బీసీ, ఎస్సీలు, ఎస్టీలకు రిజర్వేషన్ల పెంపు
మహిళా రైతు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయం
పెన్షనర్లు, ఉద్యోగస్థులకు 1వ తేదీన వేతనాలు
ఉమ్మడి పౌరస్మృతి ముసాయిదా కమిటీ ఏర్పాటుకు హామీ
చిన్న, సన్నకారు రైతులకు ఇన్‌పుట్ ఆర్థికసాయం రూ.2500
అర్హులకు కొత్త రేషన్ కార్డులు రైతులకు ఉచిత పంటల బీమాకు పీఎం ఫసల్‌బీమా యోజన వర్తింపు
మేనిఫెస్టో
వృద్ధులకు ఉచితంగా ఆయోధ్య, కాశీ యాత్ర
అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ
నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్దరణకు హామీ
పేదలందరికీ ఇళ్ల స్థలాలు
డిగ్రీ, ప్రొఫెషనల్ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌ల పంపిణీ
10 లక్షల ఉచిత ఆరోగ్య బీమా
వృద్ధులకు ఉచితంగా ఆయోధ్య, కాశీ యాత్ర
మహిళలకు 10లక్షల వరకు ఉద్యోగాల కల్పన
స్వయం సహాయక బృందాలకు 1శాతం వడ్డీకే రుణాలు
ఇళ్లల్లో పనిచేసే మహిళలకు ప్రత్యేతంగా డొమెస్టిక్ వర్కర్స్ కార్పొరేషన్ ఏర్పాటు
నిజామాబాద్‌లో టర్మరిక్ సిటీ అభివృద్ధి
ఆడబిడ్డ పుడితే.. ఆమె పేరుతో ఫిక్స్‌డ్ డిపాజిట్