తదుపరి వార్తా కథనం
AP: ఏపీలో నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త.. ప్రభుత్వ ఉద్యోగాలకు వయోపరిమితి పెంపు
వ్రాసిన వారు
Sirish Praharaju
Mar 04, 2025
05:38 pm
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది.
ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల కోసం వయోపరిమితిని పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది.
నాన్-యూనిఫామ్ ఉద్యోగాల కోసం వయోపరిమితిని 34 ఏళ్ల నుంచి 42 ఏళ్లకు, యూనిఫామ్ ఉద్యోగాల కోసం రెండేళ్లు పెంచుతూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ ఏడాది సెప్టెంబరులో జరిగే నియామకాలకు ఈ వయోపరిమితి పెంపు వర్తిస్తుందని ప్రభుత్వం ప్రకటించింది.