Loading...
Andhra Pradesh: ఏపీలో డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల.. 2,721 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రకటన
ఏపీలో డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల.. 2,721 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రకటన

Andhra Pradesh: ఏపీలో డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల.. 2,721 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రకటన

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 05, 2026
08:26 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ 2,721 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. బుధవారం అర్ధరాత్రి 12 గంటల తర్వాత ఈ ప్రకటనను అందుబాటులోకి తెచ్చింది. ఈ నెల 11 నుంచి 30 వరకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. డిసెంబరు 20 నుంచి వచ్చే ఏడాది జనవరి 13 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. అభ్యర్థుల సౌకర్యార్థం డిసెంబరు 5న ఆన్‌లైన్‌ మాక్‌ టెస్ట్‌ నిర్వహించనున్నారు. డిసెంబరు 14 నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకునే అవకాశం కల్పించారు. డీఎస్సీ పరీక్షలను కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష (సీబీటీ) విధానంలో నిర్వహించనున్నారు. క్రీడాకోటా అభ్యర్థులకు కూడా రాతపరీక్ష తప్పనిసరి.

వివరాలు 

పరీక్ష పూర్తయిన రెండు రోజుల తర్వాత ప్రాథమిక కీ

చివరి పరీక్ష పూర్తయిన రెండు రోజుల తర్వాత ప్రాథమిక కీ విడుదల చేయనున్నారు.

దీనిపై అభ్యంతరాలు తెలియజేసేందుకు అభ్యర్థులకు వారం రోజుల గడువు ఇస్తారు. అనంతరం మరో వారంలో తుది కీని విడుదల చేస్తారు.

పోస్టుల రిజర్వేషన్‌ రోస్టర్‌ పాయింట్లు, హారిజాంటల్‌ రిజర్వేషన్‌ వివరాలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు.

వివరాలు 

ఖాళీల వివరాలు..

డీఎస్సీ ద్వారా మొత్తం 2,721 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నారు.

ఇందులో సాధారణ పాఠశాలల్లో స్కూల్‌ అసిస్టెంట్‌ (ఎస్‌ఏ), సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ (ఎస్జీటీ) పోస్టులు 2,111 ఉన్నాయి.

ప్రత్యేక విద్య విభాగంలో ఎస్‌ఏ, ఎస్జీటీ పోస్టులు 350 ఉన్నాయి.

సొసైటీలు, ఇతర యాజమాన్యాల పరిధిలో ప్రిన్సిపల్‌, పీజీటీ, టీజీటీ, పీడీ, పీఈటీ పోస్టులు 260 భర్తీ చేయనున్నారు.

ADVERTISEMENT