Page Loader
Andhra Pradesh: అనుమానంతో భార్యను హత్య చేసి.. ఆత్మహత్య చేసుకున్న భర్త 
Andhra Pradesh: అనుమానంతో భార్యను హత్య చేసి.. ఆత్మహత్య చేసుకున్న భర్త

Andhra Pradesh: అనుమానంతో భార్యను హత్య చేసి.. ఆత్మహత్య చేసుకున్న భర్త 

వ్రాసిన వారు Stalin
Dec 25, 2023
09:37 am

ఈ వార్తాకథనం ఏంటి

అనుమానంతో ఓ వ్యక్తి తన భార్యను దారుణంగా హత్య చేసి.. ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లిదండ్రులు ఇద్దరు మృతి చెందడంతో వారి కొడుకు అనాథగా మారాడు. ఈ ఘటన‌తో ఆంధ్రప్రదేశ్‌లోని గుడివాడ ఉలికిపడింది. గుడివాడలోని ఎన్టీఆర్‌ కాలనీకి చెందిన రామలక్ష్మికి భీమవరం సమీపంలోని అప్పన్నపేటకు చెందిన తాతపూడి సూర్యనారాయణతో ఆరేళ్ల క్రితం వివాహమైంది. వీరికి నాలుగేళ్ల వయస్సు ఉన్న హేమాన్ష్‌ కుమార్‌ అనే కుమారుడు కూడా ఉన్నాడు. అయితే ఏడాది కాలంగా రామలక్ష్మి- సూర్యనారాయణ మధ్య గొడవలు జరుగుతున్నాయి. రామలక్ష్మిపై సూర్యనారాయణకి అనుమానం పెరగడమే ఇందుకు కారణం.

ఏపీ

12 సార్లు రామలక్ష్మిపై కత్తితో దాడి

రామలక్ష్మి- సూర్యనారాయణ పచ్చని కాపురంలో అనుమానం చిచ్చురేపడంతో.. ఇద్దరూ తరుచూ గోడవపడేవారు. రామలక్ష్మిని సూర్యనారాయణ విపరీతంగా కొట్టేవాడు. దీంతో ఆమె పుట్టింటికి వెళ్లడం.. కుటంబ పెద్దలు సర్ది చెప్పి తిరిగి కాపురానికి పంపడం పరిపాటిగా మారింది. వేధింపులు ఎక్కువ కావడంతో రామలక్ష్మి ఈ ఏడాది ఆగస్టులో గణపవరం పోలీస్‌స్టేషన్‌లో సూర్యనారాయణపై ఫిర్యాదు చేసి.. పుట్టింటికి వెళ్లింది. సూర్యనారాయణ వస్తే అతడితో మాట్లాడి.. రామలక్ష్మిని కాపురానికి పంపాలని కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో పుట్టింట్లో రామలక్ష్మి ఒంటరిగా ఉందని తెలుసుకున్న సూర్యనారాయణ.. వారికి ఇంటికి వెళ్లాడు. కత్తితో రామలక్ష్మిపై దాడి చేశాడు. 12సార్లు పొడిచాడు. దీంతో రామలక్ష్మి అక్కడిక్కడే చనిపోయింది. ఆ తర్వాత సత్యనారాయణ కూడా పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.