Andhra Pradesh: ఏపీ ఇంటర్ పబ్లిక్ పరీక్షల షెడ్యూల్ విడుదల.. ఫిబ్రవరి 24 నుంచి పరీక్షలు
ఈ వార్తాకథనం ఏంటి
ఏపీ ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ఫిబ్రవరి 24 నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఇంటర్మీడియట్ విద్యామండలి కార్యదర్శి పి. రంజిత్ బాషా గురువారం పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేశారు. ప్రథమ సంవత్సరం పరీక్షలు ఫిబ్రవరి 24 నుంచి మార్చి 15 వరకు, ద్వితీయ సంవత్సరం పరీక్షలు ఫిబ్రవరి 25 నుంచి మార్చి 16 వరకు జరగనున్నాయి.
వివరాలు
ఎంపిక చేసుకున్న సబ్జెక్టులకు ప్రత్యేక ప్రశ్నపత్రాలు
రెండో భాష (పార్ట్-2) స్థానంలో విద్యార్థులు ఎంపిక చేసుకునే గణితం, జీవశాస్త్రం, భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం, చరిత్ర, ఆర్థికశాస్త్రం, సివిక్స్, కామర్స్ సబ్జెక్టులకు ప్రత్యేక ప్రశ్నపత్రాలు ఉంటాయి.
కోర్ సబ్జెక్టులు, అదనపు సబ్జెక్టులు ఎంచుకున్న విద్యార్థులకు కలిపి ఒకే ప్రశ్నపత్రం ఇస్తారు.
కొందరు బైపీసీ విద్యార్థులు ఆరో సబ్జెక్టుగా గణితాన్ని, మరికొందరు ఎంపీసీ విద్యార్థులు ఆరో సబ్జెక్టుగా జీవశాస్త్రాన్ని ఎంచుకున్నారు.
ఇతర సబ్జెక్టులను ఎంపిక చేసుకున్న విద్యార్థులకు కూడా సంబంధిత గ్రూపు సబ్జెక్టుల విద్యార్థులకు ఇచ్చే ప్రశ్నపత్రాలనే అందజేస్తారు.
గతంలో పరీక్షల్లో ఫెయిలైన అభ్యర్థులకు పాత సిలబస్ ఆధారంగానే ప్రశ్నలు ఇస్తారు.
వివరాలు
జనవరి 27న నైతికత, మానవ విలువల పరీక్ష
ఇంటర్మీడియట్ విద్యార్థులకు నైతికత, మానవ విలువల పరీక్షను జనవరి 27న నిర్వహించనున్నారు.
పర్యావరణ విద్య పరీక్ష జనవరి 29న జరుగుతుంది. ఈ రెండు పరీక్షలు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహిస్తారు.
ఫిబ్రవరి 1 నుంచి ప్రాక్టికల్ పరీక్షలు
ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 1 నుంచి 10వ తేదీ వరకు జరగనున్నాయి.
వీటిని ప్రతిరోజూ రెండు విడతల్లో నిర్వహిస్తారు. మొదటి విడత ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో విడత మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది.
వివరాలు
ఫిబ్రవరి 17న వృత్తి విద్య థియరీ పరీక్షలు
సమగ్ర శిక్షా వృత్తి విద్య పరీక్షల్లో భాగంగా ఎన్‌ఎస్‌క్యూఎఫ్ స్థాయి-4 థియరీ పరీక్షలను ఫిబ్రవరి 17న నిర్వహిస్తారు.
ఈ పరీక్షలు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయి.
వివరాలు
ప్రథమ సంవత్సరం
ఫిబ్రవరి 24 - ఎలక్టివ్, భాషా సబ్జెక్టులు (తెలుగు, సంస్కృతం, ఉర్దూ, హిందీ, తమిళ్, ఒడియా, కన్నడ, అరబిక్, ఫ్రెంచ్, పార్శీ, గణితం, జీవశాస్త్రం, భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం, చరిత్ర, ఆర్థికశాస్త్రం, సివిక్స్, కామర్స్
ఫిబ్రవరి 26 - ఆంగ్లం ; మార్చి 1 - కోర్, అదనపు సబ్జెక్టులు (గణితం, సివిక్స్)
మార్చి 3 - జీవశాస్త్రం, చరిత్ర
మార్చి 5 - భౌతికశాస్త్రం, ఆర్థికశాస్త్రం
మార్చి 9 - రసాయనశాస్త్రం, కామర్స్
మార్చి 12 - పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, లాజిక్
మార్చి 15 - మోడ్రన్ లాంగ్వేజ్, జాగ్రఫీ
వివరాలు
ద్వితీయ సంవత్సరం..
ఫిబ్రవరి 25 - ఎలక్టివ్, భాషా సబ్జెక్టులు (తెలుగు, సంస్కృతం, ఉర్దూ, హిందీ, తమిళ్, ఒడియా, కన్నడ, అరబిక్, ఫ్రెంచ్, పార్శీ, గణితం, జీవశాస్త్రం, భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం, చరిత్ర, ఆర్థికశాస్త్రం, సివిక్స్, కామర్స్
ఫిబ్రవరి 27 - ఆంగ్లం
మార్చి 2 - కోర్, అదనపు సబ్జెక్టులు (గణితం, సివిక్స్)
మార్చి 4 - జీవశాస్త్రం, చరిత్ర
మార్చి 8 - భౌతికశాస్త్రం, ఆర్థికశాస్త్రం
మార్చి 11 - రసాయనశాస్త్రం, కామర్స్
మార్చి 13 - పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, లాజిక్
మార్చి 16 - మోడ్రన్ లాంగ్వేజ్, జాగ్రఫీ