Chandrababu Naidu: టీడీపీ-జనసేన నాయకులపై వైసీపీ ప్రభుత్వం 7,000 కేసులు పెట్టింది: చంద్రబాబు
ఈ వార్తాకథనం ఏంటి
రాబోయే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల సన్నాహాలను పరిశీలించేందుకు వచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళవారం విజయవాడలో కలిశారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలో ఓటర్ల జాబితాలో అవకతవకలపై చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ సీఈసీకి ఫిర్యాదు చేశారు.
అనంతరం చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడారు. ఓటరు జాబితాలో జరిగిన అవకతవకలపై సీఈసీకి ఫిర్యాదు చేశామన్నారు.
ప్రతిపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలపై వైసీపీ ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తోందని, టీడీపీ, జనసేన నేతలపై దాదాపు 7 వేల కేసులు పెట్టారని, పుంగనూరు కేసులో 200 మందికి పైగా జైలుకు వెళ్లారని చెప్పారు.
చంద్రబాబు
చంద్రగిరిలోనే దాదాపు లక్ష బోగస్ ఓట్లు: పవన్ కళ్యాణ్
ఎన్నికల్లో పని చేయకుండా అడ్డుకునేందుకు అక్రమ కేసులు పెడుతున్నారని, వైసీపీ చేస్తున్న అరాచకాలను సీఈసీకి వివరించామని, ప్రజాస్వామ్య పరిరక్షణకు అన్ని చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారని చంద్రబాబు వెల్లడించారు.
రాష్ట్రంలోని వాలంటీర్లకు ఎన్నికల డ్యూటీని వేసే అవకాశం ఉందా? అని అధికారులను అడిగామని, ఎన్నికల విధులకు అనుభవజ్ఞులైన సిబ్బందిని నియమించాలని అవసరమైతే కేంద్ర పోలీసు ఇన్‌స్పెక్టర్లను రాష్ట్రానికి పంపాలని ఎన్నికల సంఘాన్ని కోరినట్లు చంద్రబాబు చెప్పారు.
పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ప్రతి నియోజకవర్గంలో నకిలీ ఓట్లు ఉన్నాయని, ఈ విషయమైన సీఈసీకి ఫిర్యాదు చేసామన్నారు. చంద్రగిరిలోనే దాదాపు లక్ష బోగస్ ఓట్లు ఉన్నాయని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.