Anjani kumar: ఐపీఎస్ ఆఫీసర్ అంజనీకుమార్‌పై సస్పెన్షన్ ఎత్తివేతేసిన ఈసీ
తెలంగాణ కేడర్‌లో పని చేస్తున్న ఐపీఎస్ ఆఫీసర్ అంజనీకుమార్‌పై (Anjani kumar) కేంద్ర ఎన్నికల సంఘం (EC) సస్పెన్షన్‌ను ఎత్తివేసింది. తెలంగాణ అసెంబ్లీ ఫలితాలు వెల్లడవుతున్న సమయంలో అంజనీకుమార్ డీజీపీగా ఉన్నారు. ఒకవైపు ఫలితాలు వెల్లడవుతుండగా.. మరోవైపు డీజీపీ హోదాలో అంజనీకుమార్ రేవంత్ రెడ్డిని ఆయన ఇంటికి వెళ్లి పుష్పగుచ్ఛం అందజేసి శభాకాంక్షలు చెప్పారు. దీనిపై ఎన్నికల సంఘం అభ్యంతరం చెప్పింది. ఫలితాలు వెల్లడవుతున్న సమయంలో ఇలా చేయడం ఎన్నికల నియామవళిని ఉల్లంఘిచడమే అంటూ.. ఈసీ పేర్కొంది. ఈ మేరకు అంజనీకుమార్‌పై సస్పెషన్ వేటు వేసింది. అనంతరం అంజనీకుమార్ ఈసీకి వివరణ ఇచ్చుకున్నారు. తాను ఉద్దేశపూర్వకంగా ఎన్నికల నియామవళిని ఉల్లంఘించలేదని పేర్కొన్నారు. దీంతో సంతృప్తి చెందిన ఈసీ సస్పెషన్‌ను ఎత్తివేసింది.