Loading...
Ankita Bhandari murder: అంకితా భండారీ కేసులో మళ్లీ నిరసనలు.. ఇండియా గేట్ వద్ద తల్లిదండ్రుల అరెస్ట్
అంకితా భండారీ కేసులో మళ్లీ నిరసనలు.. ఇండియా గేట్ వద్ద తల్లిదండ్రుల అరెస్ట్

Ankita Bhandari murder: అంకితా భండారీ కేసులో మళ్లీ నిరసనలు.. ఇండియా గేట్ వద్ద తల్లిదండ్రుల అరెస్ట్

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 15, 2026
10:10 am

ఈ వార్తాకథనం ఏంటి

రిసార్టులో రిసెప్షనిస్టుగా చేరిన నెల రోజులకే అదృశ్యమై, ఆరు రోజుల తర్వాత కాలువలో శవమై కనిపించిన అంకితా భండారీ కేసు మరోసారి వార్తల్లోకి వచ్చింది. తమ కుమార్తె మృతికి న్యాయం చేయాలంటూ బుధవారం దిల్లీలోని ఇండియా గేట్ వద్ద ఆమె తల్లిదండ్రులు నిరసన చేపట్టారు. అయితే గురువారం తెల్లవారుజామున పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. అంకిత కుటుంబం చేపట్టిన ఆందోళనకు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ ఇప్పటికే మద్దతు తెలిపారు. భాజపా నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను సిక్కిం గవర్నర్‌గా నియమించడాన్ని వ్యతిరేకిస్తూ ఈ నిరసనలు చేపట్టారు.

వివరాలు 

ఉద్యోగంలో చేరిన నెల రోజులకే కనిపించని అంకిత

ఉత్తరాఖండ్‌లోని పౌడీ గఢ్వాల్ జిల్లా డోబ్-శ్రీకోట్ గ్రామానికి చెందిన అంకితా భండారీకి 19 ఏళ్లు.

ఆమె 2022 ఆగస్టులో రుషికేశ్ సమీపంలోని ఓ రిసార్టులో రిసెప్షనిస్టుగా ఉద్యోగంలో చేరింది.

అప్పట్లో ఆ రిసార్టును భాజపా సీనియర్ నేత వినోద్ ఆర్య కుమారుడు పులకిత్ ఆర్య నిర్వహించేవాడు.

ఉద్యోగంలో చేరిన నెల రోజులకే అంకిత కనిపించకుండా పోయింది.

రిసార్టుకు వచ్చే వీఐపీ అతిథులకు 'ప్రత్యేక సేవలు' అందించేందుకు ఆమె నిరాకరించడమే ఈ ఘటనకు కారణమని ఆరోపణలు వచ్చాయి.

వివరాలు 

అంకిత కుటుంబ సభ్యులతో కలిసి స్నేహితుడు పోలీసులకు ఫిర్యాదు

ఈ విషయంలో పులకిత్ ఆర్యతో పాటు అతడి ఇద్దరు సహాయకులు అంకితపై తీవ్ర ఒత్తిడి తెచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఈ వ్యవహారం చివరకు ఘర్షణకు దారితీసింది. అనంతరం అంకితను బలవంతంగా ఓ వాహనంలో తీసుకెళ్లి, రుషికేశ్ సమీపంలోని చిల్లా కెనాల్‌లో పడేసినట్లు కేసు దర్యాప్తులో వెల్లడైంది.

ఆ తర్వాత ఏమీ జరగనట్లు నిందితులు తిరిగి వచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి.

రిసార్టులో జరుగుతున్న పరిణామాల గురించి అంకిత ముందుగానే తన స్నేహితుడికి చెప్పింది.

దీంతో అతడు అంకిత కుటుంబ సభ్యులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

అంకిత అదృశ్యమైన ఆరు రోజుల తర్వాత కాలువలో ఆమె మృతదేహాన్ని గుర్తించారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను న్యాయస్థానం దోషులుగా నిర్ధారించి జీవితఖైదు విధించింది.

ADVERTISEMENT

వివరాలు 

కుటుంబ సభ్యులు, విపక్షాలు అభ్యంతరం

ఈ కేసులో ప్రస్తావనకు వచ్చిన వీఐపీ వ్యక్తి దుష్యంత్ గౌతమేనని అంకిత తండ్రి గతంలో ఆరోపించారు.

అయితే దుష్యంత్ తనపై వచ్చిన ఆరోపణలను ఇప్పటికే ఖండించారు.

ప్రస్తుతం ఈ కేసులో సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో దుష్యంత్ గౌతమ్‌ను సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై అంకిత కుటుంబ సభ్యులు, విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.

గవర్నర్ పదవి ద్వారా ఆయనకు ఈ కేసులో రాజ్యాంగపరమైన రక్షణ లభించే అవకాశం ఉందని, దీనివల్ల దర్యాప్తు ప్రభావితం కావచ్చని వారు ఆరోపిస్తున్నారు.

ADVERTISEMENT

వివరాలు 

ఇండియా గేట్ వద్ద ఆందోళన

ఈ నియామకాన్ని వ్యతిరేకిస్తూ అంకిత తల్లిదండ్రులు ఇండియా గేట్ వద్ద ఆందోళనకు దిగారు.

గురువారం తెల్లవారుజామున పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని దిల్లీలోని తిలక్ మార్గ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

అనంతరం వారిని విడుదల చేశారు. అంకిత తల్లిదండ్రులతో పాటు కాంగ్రెస్ నేతలు పవన్ ఖేడా, జోతిమణి, ఇమ్రాన్ ప్రతాప్‌గఢీ కూడా పోలీసుల అదుపులోకి తీసుకున్నవారిలో ఉన్నారు.

వారంతా పోలీస్ స్టేషన్‌లోనే నిరసన కొనసాగించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి గవర్నర్ పదవి ఇస్తూ, న్యాయం కోరుతున్న బాధితురాలి తల్లిదండ్రులను అదుపులోకి తీసుకోవడంపై విపక్ష నేతలు ప్రశ్నలు లేవనెత్తారు.

ఈ పరిణామాలతో అంకితా భండారీ కేసు మరోసారి రాజకీయ చర్చకు దారితీసింది.

ADVERTISEMENT