Page Loader
Tamilnadu: ఆసక్తికరంగా తమిళనాడు రాజకీయం.. కొరడాతో శిక్షించుకున్న అన్నామలై 
ఆసక్తికరంగా తమిళనాడు రాజకీయం.. కొరడాతో శిక్షించుకున్న అన్నామలై

Tamilnadu: ఆసక్తికరంగా తమిళనాడు రాజకీయం.. కొరడాతో శిక్షించుకున్న అన్నామలై 

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 27, 2024
12:22 pm

ఈ వార్తాకథనం ఏంటి

తమిళనాడు రాజకీయాలు ప్రస్తుతం ఆసక్తికరంగా మారాయి. డీఎంకే, బీజేపీ మధ్య రాజకీయ వాగ్వాదం మరింత వేడెక్కింది. ఈ క్రమంలో, రాష్ట్రంలోని అన్నా యూనివర్సిటీలో ఓ విద్యార్థినిపై లైంగిక వేధింపులు చోటుచేసుకున్న ఘటన కలకలం రేపింది. ఈ సంఘటనతో అధికార డీఎంకేపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో, తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆయన ఆరు కొరడా దెబ్బలు భరించి, మురుగన్‌కు మొక్కు చెల్లించుకున్నారు. ఈ చర్యకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యిన  వీడియో 

వివరాలు 

డీఎంకేను గద్దె దించే వరకు చెప్పులు వేసుకోను: అన్నామలై

తమిళనాడులో శాంతి భద్రతలపై అన్నామలై తీవ్ర ఆరోపణలు చేసారు. ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో చెడు అంతమైపోవాలని కోరుతూ కోయంబత్తూరులోని తన నివాసంలో ఆరు కొరడా దెబ్బలు భరించి, మురుగన్‌కు మొక్కు చెల్లించుకుంటానని చెప్పారు. ఆరు మురుగన్‌ క్షేతాలను దర్శించుకునేందుకు 48 గంటలపాటు ఉపవాస దీక్ష చేపడతానని తెలిపారు. శుక్రవారం, కోయంబత్తూరులోని తన ఇంటి వద్ద బీజేపీ మద్దతుదారులు, మీడియా సమక్షంలో మొక్కు చెల్లించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ముందుగా, తమిళనాడులో డీఎంకేను గద్దె దించే వరకు చెప్పులు వేసుకోనని అన్నామలై చేసిన శపథం తెలిసిందే. ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో డీఎంకే అరాచక పాలన సాగిస్తోందని, దీనిపై నిరసనగా 48 రోజులపాటు నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించారు.

వివరాలు 

అన్నా యూనివర్సిటీలో విద్యార్థినిపై లైంగిక వేధింపులు 

ఇదిలా ఉండగా, ఇటీవల తమిళనాడులోని అన్నా యూనివర్సిటీలో విద్యార్థినిపై లైంగిక వేధింపుల ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. ఈ ఘటనకు సంబంధించి, వేధించిన వ్యక్తి జ్ఞానశేఖరన్ డీఎంకే కార్యకర్త అని, అతని డీఎంకే నేతలతో ఉన్న ఫొటోలు మీడియాలో బయటపడ్డాయి. ఈ కారణంగా, పోలీసులు కేసును నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రతిపక్ష నేతలు ఆరోపించారు. డీఎంకే పాలనలో శాంతిభద్రతల విషయంలో పూర్తిగా విఫలమయ్యాయని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.