Page Loader
హైదరాబాద్ లో మరో బాలుడిపై వీధి కుక్కుల దాడి
బాలుడిపై వీధి కుక్కుల దాడి

హైదరాబాద్ లో మరో బాలుడిపై వీధి కుక్కుల దాడి

వ్రాసిన వారు Stalin
Feb 22, 2023
12:24 pm

ఈ వార్తాకథనం ఏంటి

హైదరాబాద్‌లోని అంబర్‌పేట ప్రాంతంలో వీధికుక్కల దాడిలో చిన్నారి ప్రదీప్ మృతి చెందిన ఘటన మరువకముందే, మరొకటి వెలుగులోకి వచ్చింది. తాజాగా నగరంలోని చైతన్యపురి మారుతీ నగర్‌లో మరో సంఘటన జరిగింది. ఇంటి ముందు ఆడుకుంటున్న రిషి అనే నాలుగేళ్ల చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేశాయి. దీంతో అతని చేయి, వీపు, కాళ్లకు గాయాలయ్యాయి. కుక్కలు దాడి చేయగా, రిషి కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి వెళ్లి వాటికి చెదరగొట్టారు. అనంతరం రిషిని ఆస్పత్రిలో చేర్పించి, చికిత్స అందిస్తున్నారు.

హైదరాబాద్

అధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు: చిన్నారి తల్లిదండ్రులు

వీధి కుక్కల బెడదపై ఇప్పటికే పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని, ఇప్పుడు రిషి బలి కావాల్సి వచ్చిందని స్థానికులు తెలిపారు. తాజాగా కరీంనగర్‌లోనూ ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. శంకరపట్నంలోని ఎస్సీ హాస్టల్‌లోకి వెళ్లి విద్యార్థి అనే విద్యార్థిపై వీధి కుక్కలు దాడి చేశాయి. అదే క్రమంలో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ వీధి కుక్కల దాడులు ఇప్పుడు తెలంగాణాలో, ముఖ్యంగా హైదరాబాద్‌లోనూ కలకలం రేపుతున్నాయి. వీధి కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నా, అవి కార్యరూపం దాల్చడం లేదని నగర ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.