Alla Nani: వైసీపీ మరో బిగ్ షాక్.. ఆ పార్టీ మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని రాజీనామా
వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని (కాళీకృష్ణ శ్రీనివాస్) పార్టీకి, ఏలూరు జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. అదే విధంగా అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. వ్యక్తిగత కారణాలతో రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు ఆళ్ల నాని చెప్పారు. ఈ మేరకు రాజీనామా లేఖను వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి పంపించారు.
ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఓడిపోయిన ఆళ్ల నాని
వైసీపీ ప్రభుత్వంలో ఆళ్లనాని డిప్యూటీ సీఎం పదవితో పాటు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆయన ఏలూరు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన విషయం తెలిసిందే. కాగా, ఇటీవల పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య వైసీపీకి రాజీనామాకు చేసిన విషయం తెలిసిందే.