Page Loader
AP Exams Schedule : ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల
ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల

AP Exams Schedule : ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 14, 2023
04:38 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఏపీలో పది, ఇంటర్ పరీక్షల షెడ్యూల్ ను ప్రభుత్వం విడుదల చేసింది. వచ్చే ఏడాది సాధారణ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఒక నెల రోజుల ముందుగానే పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మార్చి నెలలో పది, ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ(Botha Satyanarayana) వెల్లడించారు. మార్చి 18 నుంచి పదో తరగతి, మార్చి 1 నుంచి 15 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఫిబ్రవరి 5 నుంచి 20 వరకు ఇంటర్ ప్రాక్టికల్స్ నిర్వహిస్తుండగా, ఇంటర్ విద్యార్థులకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు పరీక్షలు జరగనున్నాయి.

Details

మార్చి 18 నుంచి పదో తరగతి పరీక్షలు

పదో తరగతి పరీక్షల షెడ్యూల్ మార్చి 18- ఫస్డ్ లాంగ్వేజ్ పేపర్-1 మార్చి 19 - సెకండ్ లాంగ్వేజ్ మార్చి 20- ఇంగ్లీష్ మార్చి 22- మ్యాథమెటిక్స్, మార్చి 23- ఫిజికల్ సైన్స్ మార్చి 26 - బయాలజీ మార్చి 27-సోషల్ స్టడీస్ మార్చి 28- మొదటి లాంగ్వేజ్ పేపర్-2 (కాంపోజిట్ కోర్సు)/ ఓఎస్ఎస్ఈ మెయిన్ లాంగ్వేజ్ పేపర్ -1 మార్చి 30-ఓఎస్ఎస్ఈ మెయిన్ లాంగ్వేజ్ పేపర్-2 ( సంస్కృతం, అరబిక్, పర్షియన్), వొకేషనల్ కోర్సుల పరీక్ష