Page Loader
Andhrapradesh: ఈ నెల 11 నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు.. సభ ముందుకు పూర్తి స్థాయి బడ్జెట్..!
ఈ నెల 11 నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు.. సభ ముందుకు పూర్తి స్థాయి బడ్జెట్..!

Andhrapradesh: ఈ నెల 11 నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు.. సభ ముందుకు పూర్తి స్థాయి బడ్జెట్..!

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 03, 2024
09:31 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నవంబర్ 11వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు సిద్ధమైంది. ఇంతకుముందు ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ప్రభుత్వం, ఇప్పుడు పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు కసరత్తు చేస్తోంది. ఈ సమావేశాల్లో ప్రభుత్వ రంగ ప్రాధాన్య అంశాలు, వివిధ కీలక బిల్లులు సభ ముందుకు రానున్నాయి. ఈ సారి అసెంబ్లీ సమావేశాల్లో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. నవంబర్ 11న లేదా మరుసటి రోజున ఆర్థిక మంత్రి వార్షిక బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టవచ్చు. ఈ సమావేశాలు పదిరోజులకు పైగా సాగవచ్చునని అంచనా.

వివరాలు 

సీఎం చంద్రబాబు నేతృత్వంలో కేబినెట్ భేటీ

ఇప్పటివరకు రాష్ట్రంలో రెండుసార్లు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన ప్రభుత్వం, ఈ నెలాఖరుతో ఓటాన్ అకౌంట్ గడువు ముగియనున్న నేపథ్యంలో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రణాళికను సిద్ధం చేస్తోంది. గత సమావేశాల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, శాంతి భద్రతలపై శ్వేతపత్రాలను విడుదల చేసింది. ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో సూపర్ సిక్స్ స్కీమ్ అమలు, కొత్త మద్యం పాలసీ, ఉచిత ఇసుక సరఫరాపై చర్చలు జరిగే అవకాశముంది. అలాగే కొత్త స్కీమ్‌లు, వాటి అమలుపై చర్చించి, కీలక ప్రకటనలు చేసే అవకాశముంది. నవంబర్ 6న సీఎం చంద్రబాబు నేతృత్వంలో కేబినెట్ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణతో పాటు బడ్జెట్‌పై లోతైన చర్చలు జరుగుతాయి.