Page Loader
chandrababu Naidu: చంద్రబాబు ముందస్తు బెయిల్‌పై ఏపీ సర్కార్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
చంద్రబాబు ముందస్తు బెయిల్‌పై ఏపీ సర్కార్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ

chandrababu Naidu: చంద్రబాబు ముందస్తు బెయిల్‌పై ఏపీ సర్కార్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ

వ్రాసిన వారు Stalin
Jan 29, 2024
03:27 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు ఇటీవల ముందస్తు బెయిల్ మంజూరు చేసిన చేసిన విషయం తెలిసిందే. ఈక్రమంలో చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ క్రమంలో ఏపీ సర్కార్ పిటిషన్‌ను ధర్మాసనం తిరస్కరించింది. ఈ కేసులో ఇతర నిందితులకు అమలు చేసే నిబంధనలు చంద్రబాబుకు కూడా వర్తిస్తాయని కోర్టు తెలిపింది. అందుకే చంద్రబాబు బెయిల్‌ను రద్దు చేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. హైకోర్టు అన్ని అంశాల‌ను పరిశీలించాకే బెయిల్ ఉత్త‌ర్వులు ఇచ్చినట్లు సుప్రీంకోర్టు పేర్కొంది. కేసు ద‌ర్యాప్తుపై ముంద‌స్తు బెయిల్ ప్ర‌భావం ఉండదని సుప్రీంకోర్టు వెల్లడించింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

చంద్రబాబుకు ఉపశమనం