Loading...
AP Local Body Elections: ఏపీలో స్థానిక ఎన్నికలకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్.. ఆరు వారాల్లో ప్రక్రియ ప్రారంభించాలి: హైకోర్టు
ఆరు వారాల్లో ప్రక్రియ ప్రారంభించాలి: హైకోర్టు

AP Local Body Elections: ఏపీలో స్థానిక ఎన్నికలకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్.. ఆరు వారాల్లో ప్రక్రియ ప్రారంభించాలి: హైకోర్టు

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 01, 2026
11:37 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. గ్రామ పంచాయతీలు,పట్టణ స్థానిక సంస్థలకు ఎన్నికల ప్రక్రియను ఆరు వారాల్లోపు ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. స్థానిక ఎన్నికలకు సంబంధించిన పలు వ్యాజ్యాలపై విచారణ పూర్తిచేసిన న్యాయస్థానం.. తీర్పులను రిజర్వు చేసింది. తాజాగా ఆయా పిటిషన్లపై ఆదేశాలు జారీ చేసింది. బీసీలకు 34శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన రెండు ప్రభుత్వ ఉత్తర్వులను హైకోర్టు కొట్టివేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో మొత్తం రిజర్వేషన్లు 50శాతానికి మించకూడదని స్పష్టం చేసింది. రిజర్వేషన్ల అంశంపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సంబంధించి దాఖలైన వ్యాజ్యాలపై విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది.

వివరాలు 

వైకాపా పిటిషన్‌ను తిరస్కరించిన హైకోర్టు

ఇదిలా ఉండగా.. 'సర్‌' ప్రక్రియ పూర్తయిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ వైకాపా దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది.

అలాగే వార్డుల పునర్విభజనకు సంబంధించి దాఖలైన మరో పిటిషన్‌ను కూడా కొట్టివేసింది.

దీంతో రాష్ట్రంలో గ్రామ పంచాయతీలు, పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ప్రక్రియ ముందుకు సాగేందుకు మార్గం సుగమమైంది.

ఆరు వారాల్లో ఎన్నికల ప్రక్రియను ప్రారంభించేలా ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.

రిజర్వేషన్ల విషయంలో మాత్రం మొత్తం కోటా 50 శాతానికి మించకుండా ఉండేలా చర్యలు చేపట్టాల్సి ఉంటుంది.

ADVERTISEMENT