AP MLAs Disqualified: 8 మంది రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు
ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైసీపీ, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలకు చెందిన 8మంది రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడింది. శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం సోమవారం వైఎస్సార్‌సీపీ, టీడీపీకి చెందిన నలుగురు చొప్పున ఎనిమిది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు. టీడీపీకి చెందిన వల్లభనేని వంశీ, కరణం బలరాం, మద్దాళి గిరిధర్, వాసుపల్లి గణేష్‌లు వైఎస్సార్‌సీపీకి మద్దతిస్తున్నందున వారిపై అనర్హత వేటు వేయాలని టీడీపీ గతంలో స్పీకర్‌కు ఫిర్యాదు చేసింది. వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి టీడీపీలోకి మారడంతో వారిపై అనర్హత వేటు పడింది. న్యాయ నిపుణులతో సంప్రదింపుల అనంతరం మొత్తం ఎనిమిది మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటిస్తూ స్పీకర్ తుది నిర్ణయం తీసుకున్నారు.