Loading...
Andhra Pradesh: పీపీపీ ప్రాజెక్టులకు రూ.1,500 కోట్ల వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ .. ఏపీ పాలసీలో కీలక నిర్ణయాలు
ఏపీ పాలసీలో కీలక నిర్ణయాలు

Andhra Pradesh: పీపీపీ ప్రాజెక్టులకు రూ.1,500 కోట్ల వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ .. ఏపీ పాలసీలో కీలక నిర్ణయాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 10, 2026
01:38 pm

ఈ వార్తాకథనం ఏంటి

రాష్ట్రంలో భారీ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పీపీపీ (పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్) పాలసీ-2026ను విడుదల చేసింది. స్వర్ణాంధ్ర విజన్-2047 లక్ష్యాలకు అనుగుణంగా మౌలిక వసతుల అభివృద్ధిని వేగవంతం చేయడంతో పాటు ప్రైవేట్ పెట్టుబడులను పెద్ద ఎత్తున తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు రూ.1.23 లక్షల కోట్ల విలువైన పీపీపీ ప్రాజెక్టులు పైప్‌లైన్‌లో ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.

వివరాలు 

ఈ రంగాలకు ప్రాధాన్యం..

రవాణా, లాజిస్టిక్స్, పోర్టులు, విమానాశ్రయాలు, పట్టణ మౌలిక వసతులు, వైద్యం, విద్య, పరిశ్రమలు, పునరుత్పాదక ఇంధనం, పర్యాటకం వంటి కీలక రంగాల్లో పీపీపీ విధానంలో ప్రాజెక్టులను చేపట్టనున్నారు.

ఆయా రంగాల్లో ప్రభుత్వ పెట్టుబడులతో పాటు ప్రైవేట్ రంగం నుంచి పెట్టుబడులు, సాంకేతిక నైపుణ్యం, నిర్వహణ సామర్థ్యాలను వినియోగించుకోవడం పాలసీ ప్రధాన ఉద్దేశంగా ప్రభుత్వం పేర్కొంది.

రూ.1,500 కోట్ల VGF కేటాయింపు

2026-27 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.1,500కోట్ల స్టేట్ వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ (VGF)ను కేటాయించింది.

ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించే క్రమంలో ప్రాజెక్టులకు అవసరమైన కీలక మూలధన లోటును VGF ద్వారా భర్తీ చేయనున్నారు.

దీనివల్ల ప్రైవేట్ రంగ భాగస్వామ్యాన్ని పెంచడంతో పాటు పెట్టుబడిదారులకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది.

వివరాలు 

ప్రాజెక్టుల అమలుకు స్పష్టమైన విధానం

పీపీపీ ప్రాజెక్టుల ప్రణాళిక, అప్రైజల్, ప్రొక్యూర్‌మెంట్, అమలు, పర్యవేక్షణకు స్పష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు.

ప్రాజెక్టు ప్రారంభ దశలో ఆర్థికంగా లాభదాయకంగా లేకపోయినా.. భవిష్యత్తులో ఆదాయాన్ని సమకూర్చే అవకాశమున్న ప్రాజెక్టులకు ప్రత్యేకంగా మద్దతు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఇందులో భాగంగా 'ప్రాజెక్ట్ వయబిలిటీ బ్రిడ్జి ఫండ్' ద్వారా వడ్డీలేని రుణాన్ని అందించే విధానాన్ని ప్రతిపాదించింది.

ADVERTISEMENT

వివరాలు 

ప్రైవేట్ రంగ సామర్థ్యాలను వినియోగించుకోవడమే లక్ష్యం

ప్రైవేట్ రంగం నుంచి వచ్చే పెట్టుబడులతో పాటు వారి సాంకేతిక పరిజ్ఞానం,నిర్వహణ సామర్థ్యాలను సమర్థంగా వినియోగించుకోవడమే పీపీపీ ప్రాజెక్టుల ప్రధాన లక్ష్యమని ప్రభుత్వం తెలిపింది.

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడంతో పాటు పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉండే మౌలిక వసతుల వ్యవస్థను అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్లు పేర్కొంది.

ఇతర రాష్ట్రాల విధానాల పరిశీలన

వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న పీపీపీ విధానాలను పరిశీలించిన అనంతరం ఏపీ పీపీపీ పాలసీ-2026ను రూపొందించినట్లు ప్రభుత్వం వెల్లడించింది.

దీనితో పాటు సంబంధిత స్టేక్‌హోల్డర్ల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకున్నట్లు తెలిపింది.

రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా, పెట్టుబడులను ఆకర్షించేలా పాలసీని రూపొందించినట్లు పేర్కొంది.

ADVERTISEMENT

వివరాలు 

అన్ని ప్రభుత్వ సంస్థలకు అమలు బాధ్యత

రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ సంస్థలు, స్వయం ప్రతిపత్తి సంస్థలు పీపీపీ పాలసీ-2026ను అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

ఈ విధానం ద్వారా ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు మౌలిక వసతుల అభివృద్ధి, ప్రజా సేవల మెరుగుదలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు.

ADVERTISEMENT