Loading...
Rain Alert: ఏపీ,తెలంగాణకు అలర్ట్.. రానున్న 48 గంటల్లో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు
తెలుగు రాష్ట్రాలకు అలర్ట్ .. రానున్న 48 గంటల్లో భారీ వర్షాలు

Rain Alert: ఏపీ,తెలంగాణకు అలర్ట్.. రానున్న 48 గంటల్లో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 10, 2026
09:15 am

ఈ వార్తాకథనం ఏంటి

బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్,తెలంగాణలో వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. గత కొన్ని రోజులుగా ఎండ,ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు చల్లటి వాతావరణం కొంత ఉపశమనం కలిగించింది. రానున్న రెండు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD)వెల్లడించింది. వర్షాలతో పాటు కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులు,పిడుగులు పడే ప్రమాదం కూడా ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. వచ్చే 48 గంటల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణలో ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్,ఖమ్మం జిల్లాలతో పాటు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో సాయంత్రం వేళ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

వివరాలు 

రాయలసీమలో కూడా అక్కడక్కడా తేలికపాటి జల్లులు పడే అవకాశం

దీంతో ఆయా ప్రాంతాల ప్రజలు వాతావరణ పరిస్థితులను గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే.. కోస్తాంధ్రలోని పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి.

రాయలసీమలో కూడా అక్కడక్కడా తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

ప్రస్తుతం నెలకొన్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో రెండు రాష్ట్రాల్లోనూ కొన్ని ప్రాంతాల్లో వర్షాల ప్రభావం కనిపించనుంది.

ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక హెచ్చరికలు జారీ చేశారు. వాతావరణ పరిస్థితుల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు.

ఈ ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.

వివరాలు 

పిడుగులు పడే అవకాశం

ఈదురుగాలుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా పాత భవనాల సమీపంలో, చెట్ల కింద ఉండకూడదని హెచ్చరించారు.

లోతట్టు ప్రాంతాల్లో నివసించే వారు కూడా జాగ్రత్తగా ఉండాలని స్పష్టం చేశారు.

వర్షాలు, గాలుల సమయంలో బయటకు వెళ్లే వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.

పొలాల్లో పనిచేసే రైతులు, మత్స్యకారులు కూడా వాతావరణ హెచ్చరికలను దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తలు పాటించాలని తెలిపారు.

పిడుగులు పడే అవకాశం ఉన్నందున వర్షం, ఉరుములు, మెరుపుల సమయంలో బహిరంగ ప్రదేశాల్లో ఉండకుండా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు.

రానున్న 48 గంటల్లో వర్షాల పరిస్థితిని ప్రజలు ఎప్పటికప్పుడు గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు పేర్కొన్నారు.

ADVERTISEMENT