Loading...
APIIC: ఏపీలో పరిశ్రమల జోరు.. 60 వేల ఎకరాల భూ సేకరణకు ఏపీఐఐసీ సిద్ధం
ఏపీలో పరిశ్రమల జోరు.. 60 వేల ఎకరాల భూ సేకరణకు ఏపీఐఐసీ సిద్ధం

APIIC: ఏపీలో పరిశ్రమల జోరు.. 60 వేల ఎకరాల భూ సేకరణకు ఏపీఐఐసీ సిద్ధం

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 14, 2026
09:49 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్'లో పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూములను ముందుగానే సిద్ధం చేసేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా కనీసం లక్ష ఎకరాలతో భారీ భూ బ్యాంక్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. భూములను ఒకేసారి కాకుండా దశలవారీగా సేకరించేలా ప్రణాళికలు రూపొందించింది. ప్రతిపాదిత భూ బ్యాంక్‌లో 60 నుంచి 70 శాతం వరకు ప్రభుత్వ భూములే ఉండనున్నాయి. అయితే ప్రభుత్వ భూముల మధ్యలో ఉన్న ప్రైవేటు భూములను కూడా సేకరించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను ఇప్పటికే జిల్లాల కలెక్టర్లకు పంపించింది.

వివరాలు 

60 వేల ఎకరాల సేకరణపై ఏపీఐఐసీ దృష్టి

వివిధ రకాల పరిశ్రమలకు అవసరమైన భూములను అందుబాటులో ఉంచేందుకు ప్రధానంగా 60 వేల ఎకరాల భూ సేకరణపై ఏపీఐఐసీ దృష్టి సారించింది.

ఈ భూముల సేకరణతో పాటు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు కూడా ఏపీఐఐసీ భారీగా నిధులు ఖర్చు చేయనుంది.

మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్‌ వంటి పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో మెరుగైన భూ బ్యాంక్‌ ఉందని అధికారులు చెబుతున్నారు.

వివరాలు 

ఇప్పటికే 1.75 లక్షల ఎకరాల కేటాయింపు

రాష్ట్రంలోని వివిధ పరిశ్రమలకు ఇప్పటివరకు ఏపీఐఐసీ సుమారు 1.75 లక్షల ఎకరాల భూమిని కేటాయించింది.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన గత రెండేళ్లలోనే పరిశ్రమల ఏర్పాటుకు 22 వేల ఎకరాల భూమిని సేకరించింది.

ప్రస్తుతం పలు కీలక సంస్థల కోసం కూడా భూసేకరణ కొనసాగుతోంది.

బీపీసీఎల్‌కు 6,000 ఎకరాలు, ఇండోసోల్‌కు 1,000 ఎకరాలు, జేఎస్‌డబ్ల్యూకు 3,200 ఎకరాలు, భాభా అటామిక్‌ రీసెర్చ్‌ సెంటర్‌ (బార్క్‌) కోసం 3,000 ఎకరాలు, ఎన్‌టీపీసీ కోసం 4,000 ఎకరాల భూమిని సేకరిస్తోంది.

వీటితో పాటు ఇతర పరిశ్రమలకు అవసరమైన భూముల కోసం మరో 60 వేల ఎకరాల సేకరణకు ప్రతిపాదనలు రూపొందించింది.

ADVERTISEMENT

వివరాలు 

ఏటా కొంత భూమిని సేకరించేలా ప్రణాళిక

ప్రతిపాదించిన 60 వేల ఎకరాలను ఒకేసారి సేకరించకుండా ఏటా కొంత మొత్తంలో భూమిని సమీకరించాలని ఏపీఐఐసీ భావిస్తోంది.

ఇందులో భాగంగా ఈ ఏడాదిలో కనీసం 20 వేల ఎకరాలను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

1.25 లక్షల ఎకరాలు అవసరం

రాష్ట్ర ప్రభుత్వంతో ఇప్పటికే ఒప్పందాలు కుదుర్చుకున్న సంస్థల అవసరాలను దృష్టిలో పెట్టుకుని కనీసం 1.25 లక్షల ఎకరాల భూమి అవసరమవుతుందని ఏపీఐఐసీ అంచనా వేసింది.

ప్రస్తుతం ఏపీఐఐసీ ఆధీనంలో రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో కలిపి 46,845 ఎకరాల భూమి అందుబాటులో ఉంది.

ADVERTISEMENT

వివరాలు 

లక్ష ఎకరాల భూ బ్యాంక్‌ నిర్వహణే లక్ష్యం

వివిధ పరిశ్రమలకు భూములు కేటాయించిన తర్వాత కూడా కనీసం లక్ష ఎకరాల భూమిని భూ బ్యాంక్‌గా అందుబాటులో ఉంచేలా ప్రతిపాదనలు రూపొందించినట్లు ఏపీఐఐసీ వీసీ, ఎండీ దినేష్‌కుమార్‌ తెలిపారు.

ఇప్పటికే అందుబాటులో ఉన్న భూములను గుర్తించినట్లు ఆయన వెల్లడించారు.

భవిష్యత్తులో పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూములు ముందుగానే సిద్ధంగా ఉండేలా ఈ భూ బ్యాంక్‌ను నిర్వహించనున్నట్లు అధికారులు చెబుతున్నారు.

ADVERTISEMENT