Loading...
Big Rain Alert:ఏపీకి మరో వర్ష సూచన.. బంగాళాఖాతంలో అల్పపీడనం.. అధికారుల హెచ్చరిక
ఏపీకి మరో వర్ష సూచన.. బంగాళాఖాతంలో అల్పపీడనం.. అధికారుల హెచ్చరిక

Big Rain Alert:ఏపీకి మరో వర్ష సూచన.. బంగాళాఖాతంలో అల్పపీడనం.. అధికారుల హెచ్చరిక

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 12, 2026
09:00 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి వాతావరణ పరిస్థితులు మారనున్నాయి. ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండటంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉత్తర అండమాన్ సముద్రం పరిసరాల్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రేపు ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడవచ్చని అంచనా వేస్తున్నారు.

వివరాలు 

మూడు, నాలుగు రోజుల్లో వాయుగుండంగా మారే అవకాశం

బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం రానున్న మూడు, నాలుగు రోజుల్లో బలపడి ఉత్తర తమిళనాడు-దక్షిణ కోస్తాంధ్ర దిశగా కదిలే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఈ క్రమంలో అది మరింత బలపడి వాయుగుండంగా మారే సూచనలు ఉన్నాయని పేర్కొన్నారు.

ఈ వాతావరణ వ్యవస్థ ప్రభావంతో రానున్న రెండు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడవచ్చని అధికారులు హెచ్చరిస్తున్నారు.

వివరాలు 

ప్రజలు, రైతులు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలి

వాతావరణంలో చోటుచేసుకోనున్న మార్పుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ, వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు.

ముఖ్యంగా సముద్రంలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు జాగ్రత్తలు పాటించాలని, అధికారుల సూచనలను తప్పనిసరిగా అనుసరించాలని కోరారు.

మరోవైపు, కోత దశలో ఉన్న పంటల విషయంలో రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

వర్షాల తీవ్రత, గాలి దిశలో వచ్చే మార్పులను దృష్టిలో ఉంచుకుని తగిన చర్యలు చేపట్టాలని తెలిపారు.

వాతావరణ పరిస్థితులు మారే అవకాశం ఉన్నందున అధికారిక హెచ్చరికలను ఎప్పటికప్పుడు గమనించాలని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

ADVERTISEMENT