Page Loader
Jammu and Kashmir: నియంత్రణ రేఖ వద్ద ఎన్‌కౌంటర్; ఇద్దరు ఉగ్రవాదులు హతం 
నియంత్రణ రేఖ వద్ద ఎన్‌కౌంటర్; ఇద్దరు ఉగ్రవాదులు హతం

Jammu and Kashmir: నియంత్రణ రేఖ వద్ద ఎన్‌కౌంటర్; ఇద్దరు ఉగ్రవాదులు హతం 

వ్రాసిన వారు Stalin
Aug 07, 2023
09:44 am

ఈ వార్తాకథనం ఏంటి

జమ్ముకశ్మీర్‌ పూంచ్‌లోని దేగ్వార్ టెర్వాన్ ప్రాంతంలో నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ) వెంబడి సోమవారం తెల్లవారుజామున ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నాన్ని భద్రతా దళాలు భగ్నం చేశాయి. ఈ సందర్భంగా జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ విషయాన్ని ఆర్మీ అధికారులు ధృవీకరించారు. భారత సైన్యం, జమ్ముకశ్మీర్ పోలీసులు ఉమ్మడిగా ఉగ్రవాదల చొరబాటును నిరోధించినట్లు జమ్ము పీఆర్ఓ లెఫ్టినెంట్ కల్నల్ సునీల్ బర్త్వాల్ తెలిపారు. మొదట ఒక ఉగ్రవాదిని కాల్పి చంపగా, రెండో టెర్రరిస్టు పరుగెత్తినట్లు చెప్పారు. అతన్ని కూడా షూట్ చేసినట్లు వెల్లడించారు. అయితే మృతదేహాలను ఇంకా స్వాధీనం చేసుకోలేదని పేర్కొన్నారు.

ఉగ్రవాది

తంగ్‌ధర్ సెక్టార్‌లో మరో ఉగ్రవాది ఎన్‌కౌంటర్

దేగ్వార్ టెర్వా ప్రాంతంలో నియంత్రణ రేఖ వద్ద ఇద్దరు ఉగ్రవాదులు ఉన్నట్లు పూంచ్‌లోని గర్హి బెటాలియన్‌‌కు రాత్రి 02:00 గంటలకు సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన సైన్య, జమ్ము కశ్మీకర్ పోలీసులు ఇద్దరిని హతమార్చాయి. ఇదిలా ఉంటే, తంగ్‌ధర్ సెక్టార్‌లో ఆదివారం భారత సైన్యం, కుప్వారా పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో ఒక ఉగ్రవాది హతమైనట్లు కశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు. ఉగ్రవాది నుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు కశ్మీర్ జోన్ పోలీసులు ట్వీట్ చేశారు. అలాగే సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని పోలీసులు పేర్కొన్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

కశ్మీర్ పోలీసులు చేసిన ట్వీట్