Page Loader
Army: అగ్నివీర్ అమృత్‌పాల్ సింగ్ ఆత్మహత్య.. ఆర్మీ కీలక ప్రకటన

Army: అగ్నివీర్ అమృత్‌పాల్ సింగ్ ఆత్మహత్య.. ఆర్మీ కీలక ప్రకటన

వ్రాసిన వారు Stalin
Oct 16, 2023
11:20 am

ఈ వార్తాకథనం ఏంటి

సెంట్రీ డ్యూటీలో సమయంలో అగ్నివీర్ అమృత్‌పాల్ సింగ్ తన తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సాధారణంగా ఆర్మీ జవాన్లు చనిపోతే, గౌరవ వందనం చేస్తారు. అయితే అగ్నివీర్ అమృత్‌పాల్ సింగ్‌కు గౌరవ వందనం చేసే విషయంపై ఆర్మీ కీలక ప్రకటన చేసింది. ఆత్మహత్య వల్ల సంభవించే మరణాలకు అటువంటి గౌరవం వందనం ఉండదని, అందుకే అగ్నివీర్ అమృత్‌పాల్ సింగ్‌ అంత్యక్రియలకు సైనిక గౌరవం ఇవ్వలేదని భారత సైన్యం తెలిపింది. అమృత్‌పాల్ సింగ్ అగ్నివీర్ సైనికుడు కావడం వల్లే అంత్యక్రియలకు సైనిక గౌరవం ఇవ్వలేదన్న ఆరోపణలు వచ్చాయి. ఆరోపణలకు చెక్ పెట్టేందుకు ఆర్మీ ఈ ప్రకటన చేసింది. ఆర్మీలోని సైనికుల మధ్య ఇలా వ్యత్యాసాలు చూపబోమని సైన్యం పేర్కొంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

అమృత్‌పాల్ సింగ్‌ అంత్యక్రియల దృశ్యాలు