Golden Temple: స్వర్ణ దేవాలయంలో సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌పై హత్యాయత్నం.. నిందితుడు అరెస్ట్
పంజాబ్ అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయంలో చోటుచేసుకున్న కాల్పుల ఘటన పంజాబ్ రాష్ట్రాన్ని కుదిపేసింది. ఈ ఘటనలో పంజాబ్ మాజీ ఉప ముఖ్యమంత్రి, శిరోమణి అకాలీదళ్ పార్టీ నేత సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌పై గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరిపాడు. స్వర్ణ దేవాలయ ప్రవేశద్వారం వద్ద సేవాదార్‌గా విధులు నిర్వహిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది.
ఘటన ఎలా జరిగింది?
సుఖ్‌బీర్ చక్రాల కుర్చీపై కూర్చొని సేవాదార్‌గా పని చేస్తుండగా, ఓ వృద్ధుడు అతని దగ్గరకు చేరాడు. కొద్ది దూరంలో ఉన్న వృద్ధుడు తన జేబులోంచి తుపాకీ తీసి కాల్పులు జరిపాడు. అయితే సుఖ్‌బీర్ వ్యక్తిగత భద్రతా సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించి, నిందితుడిని వెంటనే అడ్డుకున్నారు. ఈ ఘటనలో సుఖ్‌బీర్‌కు ఎలాంటి గాయాలు కాకపోవడం పట్ల అంతా ఊపిరి పీల్చుకున్నారు. నిందితుడిని నారైన్ సింగ్ చౌరాగా గుర్తించి, పోలీసులకు అప్పగించారు. అతను గతంలో బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ ఉగ్రవాద సంస్థలో పనిచేసిన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
శిక్ష అనుభవిస్తున్న సుఖ్‌బీర్ సింగ్ బాదల్
సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌పై గతంలో మతపరమైన తప్పిదాలకు సంబంధించిన ఆరోపణలు ఉన్నాయి. 2007-2017 కాలంలో ఆయన నేతృత్వంలోని శిరోమణి అకాలీదళ్ పార్టీ ప్రభుత్వం పలు రాజకీయ తప్పిదాలకు పాల్పడిందని అకాల్ తఖ్త్ తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు మేరకు సుఖ్‌బీర్ సేవకుడిగా విధులు నిర్వర్తించాలని నిర్ణయించబడింది. సేవాదార్‌గా విధులు తన చేసిన తప్పులను అంగీకరిస్తూ, ఒక బోర్డును మెడలో ధరించి, చేతిలో ఈటెను పట్టుకుని సేవాదార్‌గా స్వర్ణ దేవాలయంలో బూట్లు, పాత్రలు శుభ్రం చేస్తున్నారు. అలాగే, పార్టీ చీఫ్ పదవి నుండి ఆయన రాజీనామా చేయాలని, ఆరు నెలలలోపు కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకోవాలని ఆదేశాలు జారీ అయ్యాయి.
భవిష్యత్ పట్ల ఉత్కంఠ
ఈ ఘటన సుఖ్‌బీర్ సింగ్ బాదల్ భద్రతా పరమైన అంశాలపై ప్రశ్నలు తెరతెస్తోంది. అతని మీద జరుగుతున్న ఆరోపణలు, తాజా సంఘటన రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కించే అవకాశం ఉంది.