LOADING...
Uttar Pradesh: ఉత్తర్‌ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. 11 మంది సజీవ దహనం
ఉత్తర్‌ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. 11 మంది సజీవ దహనం

Uttar Pradesh: ఉత్తర్‌ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. 11 మంది సజీవ దహనం

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 23, 2026
09:31 am

ఈ వార్తాకథనం ఏంటి

ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అదుపుతప్పిన ఓ భారీ లారీ వరుసగా పలు వాహనాలను ఢీకొనడంతో 11 మంది సజీవదహనానికి గురయ్యారు. పోలీసుల సమాచారం ప్రకారం, లసోడా వైపు ప్రయాణిస్తున్న లారీకి అకస్మాత్తుగా బ్రేకులు పనిచేయలేదు. దీంతో అది ముందుకు వెళ్తున్న కారు, సరుకు వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఆ ఢీకొట్టిన ప్రభావంతో సరుకు వాహనం ముందుగా ప్రయాణిస్తున్న ప్రయాణికుల వాహనాన్ని ఢీకొనడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు వేగంగా వ్యాపించడంతో ఆ వాహనంలో ఉన్న 11 మంది బయటపడలేక మంటల్లోనే ప్రాణాలు కోల్పోయారు.

వివరాలు 

విషమంగా డ్రైవర్‌ పరిస్థితి

ఈ ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్‌ కూడా తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. గాయపడిన డ్రైవర్‌ను ఆస్పత్రికి తరలించగా, అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వెల్లడించారు. మృతుల వివరాలను గుర్తించేందుకు పోలీసులు చర్యలు ప్రారంభించారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. ప్రమాదం కారణంగా ఆ ప్రాంతంలో రాకపోకలు అంతరాయం కలగకుండా పోలీసులు తక్షణ చర్యలు తీసుకున్నారు.

Advertisement