Page Loader
Atal Bihari Vajpayee: అటల్‌ బిహారి వాజ్‌పేయీ జయంతి.. రూ.వంద నాణేన్ని ఆవిష్కరించిన మోదీ
అటల్‌ బిహారి వాజ్‌పేయీ జయంతి.. రూ.వంద నాణేన్ని ఆవిష్కరించిన మోదీ

Atal Bihari Vajpayee: అటల్‌ బిహారి వాజ్‌పేయీ జయంతి.. రూ.వంద నాణేన్ని ఆవిష్కరించిన మోదీ

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 25, 2024
02:47 pm

ఈ వార్తాకథనం ఏంటి

దివంగత ప్రధాని అటల్‌ బిహారి వాజ్‌పేయీ 100వ జయంతిని దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్నారు. వాజ్‌పేయీ వందవ జయంతి సందర్భంగా రూ.100 స్మారక నాణేన్ని విడుదల చేయడంతో పాటు ప్రత్యేక స్టాంప్‌ను కూడా ఆవిష్కరించారు. అటల్‌ జయంతి సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలోని సదైవ్‌ అటల్‌ స్మారక స్థలంలో ప్రముఖ నేతలు పుష్పగుచ్ఛాలు ఉంచి ఆయనకు నివాళులర్పించారు.

Details

రాజకీయ ప్రముఖులు హాజరు

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌కడ్‌, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ, కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఏపీ సీఎం చంద్రబాబు, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ వంటి ప్రముఖులు పాల్గొని వాజ్‌పేయీకి శ్రద్ధాంజలి ఘటించారు.