
బల్లియా: గంగా నదిలో పడవ బోల్తా, నలుగురు మృతి, 24మంది గల్లంతు
ఈ వార్తాకథనం ఏంటి
ఉత్తర్‌ప్రదేశ్‌లోని బల్లియా జిల్లాలోని మల్దేపూర్ ప్రాంతంలో సోమవారం గంగా నదిలో పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా, మరో రెండు డజన్ల మంది గల్లంతైనట్లు సమాచారం.
పడవలో 40నుంచి 50మంది వ్యక్తులు ప్రయాణిస్తున్నారని, అందులో ఇప్పటివరకు నలుగురు మహిళల మృతదేహాలు మాత్రమే వెలికి తీసినట్లు అధికారులు చెప్పారు.
స్థానిక బోట్ మెన్ సహాయంతో ఆ ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. క్షతగాత్రులను బల్లియాలోని జిల్లా ఆసుపత్రికి తరలిస్తున్నారు.
బల్లియా జిల్లా మేజిస్ట్రేట్ రవీంద్ర మాట్లాడుతూ, ఇప్పటి వరకు ముగ్గురు చనిపోయారని, మరో ముగ్గురు జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని స్పష్టంచేశారు. స్థానికంగా జరిగే జాతరకు వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
బల్లియా ఆస్పత్రిలోని దృశ్యాలు
VIDEO | Several killed after a boat capsized in river Ganga near Maldepur area of Ballia district in Uttar Pradesh earlier today. pic.twitter.com/cSMGZr4wek
— Press Trust of India (@PTI_News) May 22, 2023