Hyderabad: హైదరాబాద్ వాసులకు హెచ్చరిక.. ఇకపై అలాంటి పనులు నిషేధం!
ఈ వార్తాకథనం ఏంటి
ఒకప్పుడు పుట్టిన రోజు వేడుకలు ఇంటి సభ్యులతో కలిసి ఇంట్లో సంతోషంగా జరుపుకునేవారు.
కానీ ఇప్పుడు యువకులు కొత్త ట్రెండ్‌కు మారారు. రోడ్లపై కార్లు, బైకులు ఆపి వాటిపై కేక్ కటింగ్ చేస్తూ హంగామా చేస్తున్నారు.
ఒక్కోసారి పుట్టిన రోజు వేడుకల్లో అత్యుత్సాహం ప్రదర్శించడం వల్ల అపశ్రుతులు కూడా చోటు చేసుకున్న ఘటనలు చాలానే ఉన్నాయి.
తాజాగా హైదరాబాద్ వాసులకు జీహెచ్ఎంసీ హెచ్చరికలను జారీ చేసింది.
ట్యాంక్ బండ్ వద్ద అర్ధరాత్రి కేక్ కట్ చేయడం వల్ల ప్రజలకు అసౌకర్యంగా ఉండటంతో జీహెంచ్ఎంసీ సంచలన నిర్ణయం తీసుకుంది.
ఇక నుంచి ట్యాంక్ బండ్ పై కేక్ కట్ చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సిన వస్తుందని జీహెచ్ఎంసీ హెచ్చరించింది.
Details
భారీ జరిమానాలను విధిస్తామన్న జీహెచ్ఎంసీ
ఒకవేళ ఆదేశాలను ఉల్లంఘించి ఎవరైనా పుట్టిన రోజు జరుపుకుంటే భారీ జరిమానా చెల్లించాల్సి ఉంటుందని జీహెచ్ఎంసీ తెలిపింది.
ట్యాంక్ బండ్ పై కేక్ కేటింగ్ పేరుతో వ్యర్థాలను వేస్తే సీసీ కెమెరాల నిఘాతో పట్టుకుంటామని ఈ మేరకు జీహెచ్ఎంసీ ఉత్తర్వులు జారీ చేసింది.
మరికొంత మంది మందుబాబులు బాటిల్స్ పగులగొట్టడం, ర్యాష్ డ్రైవింగ్ చేయడం వల్ల చుట్టుపక్కల ప్రాంతాల వారికి తీవ్ర ఇబ్బందులు ఎదరవుతున్నాయి.
ఇలా చేయడం న్యూసెన్స్ ని చాలా వరకు అరికట్టవొచ్చని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.