Page Loader
భారతదేశపు మొట్టమొదటి మల్టీ-మోడల్ ట్రాన్స్‌పోర్ట్ హబ్‌గా బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌
భారతదేశపు మొట్టమొదటి మల్టీ-మోడల్ ట్రాన్స్‌పోర్ట్ హబ్‌గా బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌

భారతదేశపు మొట్టమొదటి మల్టీ-మోడల్ ట్రాన్స్‌పోర్ట్ హబ్‌గా బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌

వ్రాసిన వారు Stalin
Mar 29, 2023
04:32 pm

ఈ వార్తాకథనం ఏంటి

మల్టీ-మోడల్ ట్రాన్స్‌పోర్ట్ హబ్ (ఎంఎంటీహెచ్)గా బెంగళూరు విమానాశ్రయం అవతరించనున్నది. భారతదేశంలోనే మొట్ట మొదటిగా ఈ స్థాయి గుర్తింపు పొందిన విమానాశ్రయంంగా బెంగళూరు నిలవనుంది. ఎంఎంటీహెచ్ ఫేజ్ 1 మరో రెండు నెలల్లో ప్రారంభం కానుంది. ఫేజ్‌-2లో భాగంగా నిర్మించే కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్(కేఐఏ) టెర్మినల్స్ మెట్రో స్టేషన్ (కేఆర్‌పురం-హెబ్బల్-కేఐఏ మెట్రో కారిడార్) 2026లో అందుబాటులోకి రానుంది. ఇది పూర్తయితే మల్టీ-మోడల్ ట్రాన్స్‌పోర్ట్ హబ్ (ఎంఎంటీహెచ్)గా బెంగళూరు విమానాశ్రయం అరుదైన ఘనతను సొంతం చేసుకుటుంది.

బెంగళూరు

మల్టీ-మోడల్ ట్రాన్స్‌పోర్ట్ హబ్ (ఎంఎంటీహెచ్) అంటే ఏమిటి?

వివిధ ప్రాంతాల నుంచి ప్రయాణికులు బెంగుళూరు విమానాశ్రయానికి రావడానికి, అలాగే ఎయిపోర్టు నుంచి తమ గమ్యస్థానాలకు వెళ్లడానికి అన్నిరకాల ప్రయాణ సౌకర్యాలు ఉన్నట్లయితే దానిని మల్టీ-మోడల్ ట్రాన్స్‌పోర్ట్ హబ్ (ఎంఎంటీహెచ్) అంటారు. దేశంలో ఇలాంటి సౌకర్యాలు ఉన్న విమానాశ్రయం ఒక్కటి కూడా లేదు. ఇప్పుడు మెట్రో పనులు పనులు పూర్తయితే దేశంలో బెంగళూరు విమానాశ్రయం ఎంఎంటీహెచ్‌గా గుర్తింపు పొందుతుంది. చెన్నై విమానాశ్రయం బస్సు, మెట్రో స్టేషన్లకీ అనుసంధానించబడినప్పకీ, అవి ఒకే దగ్గర లేకపోవడం గమనార్హం.

బెంగుళూరు

బెంగుళూరు విమానాశ్రయంలో విస్తారమైన పార్కింగ్ స్థలం కేటాయింపు

సమీప భవిష్యత్తులో బెంగుళూరు విమానాశ్రయంలో ప్రైవేట్ కార్లు, టాక్సీల కోసం విస్తారమైన పార్కింగ్ స్థలాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఎంఎంటీహెచ్ సౌకర్యాల విషయంలో స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్, లండన్‌లోని హీత్రో విమానాశ్రయాల బాటలో నడుస్తుందని బెంగుళూరు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (బీఐఏఎల్) ప్రతినిధి తెలిపారు. అధునాతన సౌకర్యాలతో నిర్మాణంలో ఉన్న ఎంఎంటీహెచ్ అనతికాలంలోనే నిర్మాణం పూర్తవుతుందని బెంగుళూరు వాసులు ఆశిస్తున్నారు. ప్రయాణీకులకు అవాంతరాలు లేని సురక్షితమైన ప్రయాణ అనుభూతిని అందించి ఎంఎంటీహెచ్ సరికొత్త చరిత్ర సృష్టిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.