
నీరు వృథా చేస్తే రూ.5000 ఫైన్.. ఎక్కడో తెలుసా?
ఈ వార్తాకథనం ఏంటి
బెంగళూరులోని ఒక హౌసింగ్ సొసైటీ నగరంలో తీవ్రమైన నీటి ఎద్దడిని దృష్టిలో ఉంచుకుని కొన్ని కఠినమైన చర్యలు తీసుకుంది.
ఈ సొసైటీలో నీటి సంరక్షణ కోసం ప్రత్యేక సిబ్బందిని నియమించడమే కాకుండా.. నీటిని వృథా చేస్తే జరిమానాలు విధిస్తోంది.
వర్షాభావ పరిస్థితుల కారణంగా బెంగళూరు తీవ్రమైన నీటి ఎద్దడిని ఎదుర్కొంటోంది.
ఇక్కడ బోర్లు ఎండిపోయి భూగర్భ జలాలు కూడా పడిపోయాయి. ట్యాంకర్ల సాయంతో బెంగుళూరు వాసులకు నీటిని సరఫరా చేస్తున్న పరిస్థితి నెలకొంది.
ఈ క్రమంలో నీటిని ఎద్దడిని అరికట్టేందుకు హౌసింగ్ సొసైటీ తీసుకున్న చర్యను పలువురు ప్రశంసిస్తున్నారు.
బెంగళూరు
భవిష్యత్‌లో నీటికోత మరింత పెరిగే అవకాశం
బెంగళూరులో అత్యంత నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో వైట్‌ఫీల్డ్ ప్రాంతంలో ఉన్న 'పామ్ మెడోస్ సొసైటీ' ఒకటి.
గత 4 రోజులుగా బెంగళూరు వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (BWSSB) నుంచి నీరు అందడం లేదు.
దీంతో నీటి ఎద్దడిని తెలియజేసేందుకు, అలాగే పరిష్కార మార్గాన్ని చూపుతూ.. 'పామ్ మెడోస్ సొసైటీ' నివాసితులకు నోటీసు జారీ చేసింది.
నీటి ఎద్దడిని ఎదుర్కోవడానికి.. ప్రతి ఇంట్లో నీటి వినియోగాన్ని 20 శాతం తగ్గించాలని సూచించింది.
20శాతం తక్కువగా నీటిని వినియోగించకుంటే రూ.5,000 జరిమానా విధించాల్సి ఉంటుందని సొసైటీ పేర్కొంది.
ఇదే కాకుండా, నీటి సరఫరాలో రానురాను కోత పెరగవచ్చని తెలిపింది. వేసవి నెలల్లో కోత 40 శాతం వరకు పెంచనున్నట్లు వెల్లడించింది.