Page Loader
Padi kaushik Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి బిగ్ షాక్.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణ
బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి బిగ్ షాక్.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణ

Padi kaushik Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి బిగ్ షాక్.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణ

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 16, 2025
12:07 pm

ఈ వార్తాకథనం ఏంటి

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి హైకోర్టు వద్ద ఎదురుదెబ్బ తగిలింది. తనపై నమోదైన క్రిమినల్‌ కేసును రద్దు చేయాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు తిరస్కరించింది. కమలాపురం మండలంలోని వంగపల్లిలో ఓ గ్రానైట్‌ వ్యాపారి మనోజ్‌ ఖనిజ వ్యాపారం నిర్వహిస్తున్నారు.

Details

రూ.50లక్షలు ఇవ్వాలంటూ బెదిరింపులు

ఈ వ్యాపారానికి సంబంధించి ఆయన భార్య ఉమాదేవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో రూ.50 లక్షలు ఇవ్వాలంటూ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి బెదిరించారని ఆమె పేర్కొన్నారు. దీనిపై స్పందించిన సుబేదారి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును కొట్టివేయాలంటూ ఎమ్మెల్యే ఇటీవల హైకోర్టును ఆశ్రయించారు. అయితే విచారణ అనంతరం హైకోర్టు ఆయన పిటిషన్‌ను తిరస్కరిస్తూ, కేసు కొనసాగుతుందని పేర్కొంది. దీంతో కౌశిక్‌రెడ్డికి న్యాయపరంగా ఎదురుదెబ్బ తగిలినట్టైంది.