LOADING...
Jeevan Reddy: కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. జీవన్‌రెడ్డి రాజీనామా డేట్ ఫిక్స్!
కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. జీవన్‌రెడ్డి రాజీనామా డేట్ ఫిక్స్!

Jeevan Reddy: కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. జీవన్‌రెడ్డి రాజీనామా డేట్ ఫిక్స్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 22, 2026
11:21 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలోని జగిత్యాల రాజకీయాలు ఇటీవలి రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారాయి. కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తితో ఉన్న సీనియర్ నేత జీవన్ రెడ్డి పార్టీకి గుడ్‌బై చెప్పేందుకు సిద్ధమయ్యారని సమాచారం. ఈ నెల 25న తన అనుచరులతో కలిసి అధికారికంగా రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అనంతరం 27వ తేదీ నుంచి గ్రామాల బాట పట్టి, ప్రజలతో నేరుగా మాట్లాడాలని ఆయన భావిస్తున్నారు. గ్రామాల్లో పర్యటిస్తూ పార్టీ మార్పుపై ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకోవాలని యోచిస్తున్నారు. అలాగే తనకు జరిగిన అన్యాయం పార్టీ ఫిరాయింపుల అంశాలను ప్రజలకు వివరించాలన్న లక్ష్యంతో ఈ పర్యటన చేపట్టనున్నట్లు సమాచారం. ఇక ఏప్రిల్ 10లోపు ఆయన బీఆర్ఎస్‌లో చేరే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Details

త్వరలోనే బహిరంగ సభ

ఈ నేపథ్యంలో హైదరాబాద్‌కు లేదా ఫార్మ్ హౌస్‌కు రావాలని బీఆర్ఎస్ వర్గాలు ఆహ్వానించినట్లు సమాచారం. అయితే జగిత్యాలలోనే బహిరంగ సభ నిర్వహించి పార్టీలో చేరాలని ఆ కార్యక్రమానికి కె.చంద్రశేఖర్ రావు హాజరవ్వాలని జీవన్ రెడ్డి కోరినట్లు తెలుస్తోంది. మరోవైపు ఆయనను ఒప్పించే ప్రయత్నాలు కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పటికే పలుమార్లు జరిగాయి. పలువురు మంత్రులు స్వయంగా వెళ్లి చర్చించినప్పటికీ, ఆయన తన నిర్ణయాన్ని మార్చుకోలేదని తెలుస్తోంది. కరీంనగర్‌కు చెందిన మంత్రులు డి. శ్రీధర్ బాబు, అడూరి లక్ష్మణ్, డీసీసీ అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంలు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది.

Advertisement