Loading...
Bihar: ఉచిత విద్యుత్ సబ్సిడీ వదులుకోవాలని పన్ను చెల్లింపుదారులకు బిహార్ సీఎం సూచన
ఉచిత విద్యుత్ సబ్సిడీ వదులుకోవాలని పన్ను చెల్లింపుదారులకు బిహార్ సీఎం సూచన

Bihar: ఉచిత విద్యుత్ సబ్సిడీ వదులుకోవాలని పన్ను చెల్లింపుదారులకు బిహార్ సీఎం సూచన

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 02, 2026
11:22 am

ఈ వార్తాకథనం ఏంటి

బిహార్‌లో ఎన్నికల సమయంలో ఇచ్చిన ఉచిత విద్యుత్ హామీపై బీజేపీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ప్రజలకు అందిస్తున్న 125 యూనిట్ల ఉచిత విద్యుత్ సబ్సిడీని స్వచ్ఛందంగా వదులుకోవాలని పన్ను చెల్లింపుదారులు, ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉన్నవారిని కోరింది. ఎన్నికల సమయంలో ప్రజలందరికీ ఉచిత విద్యుత్ అందిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం.. ఇప్పుడు కొందరు ఈ ప్రయోజనాన్ని వదులుకోవాలని విజ్ఞప్తి చేయడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బిహార్ రాజధాని పాట్నాలో రెండు రోజుల పాటు నిర్వహించిన 'పాటలీపుత్ర నేషనల్ యూత్ పార్లమెంట్ 2.0' సదస్సులో ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి ఈ అంశంపై మాట్లాడారు.

వివరాలు 

ఏటా రూ.23 వేల కోట్ల విద్యుత్ సబ్సిడీ భారం

రాష్ట్రంలో పన్నులు చెల్లించే వారు, ఆర్థికంగా స్థిరమైన పరిస్థితిలో ఉన్న ధనికులు తమకు అందుతున్న 125 యూనిట్ల ఉచిత విద్యుత్ సబ్సిడీని స్వచ్ఛందంగా వదులుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

రాష్ట్రంలోని ప్రతి ఇంటికి ప్రభుత్వం ఏడాదికి సుమారు రూ.8 వేల నుంచి రూ.10 వేల వరకు విద్యుత్ సబ్సిడీ అందిస్తోందని సీఎం సామ్రాట్ చౌదరి తెలిపారు.

పథకం అమలుకు ప్రభుత్వం ఏటా దాదాపు రూ.23 వేల కోట్లు ఖర్చు చేస్తోందని వివరించారు.

ప్రభుత్వంపై పడుతున్న ఆర్థిక భారాన్ని తగ్గించుకునే ఉద్దేశంతోనే ఈ విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది.

అయితే, ఎన్నికల సమయంలో ఇచ్చిన ఉచిత విద్యుత్ హామీని ప్రభుత్వం ఇప్పుడు వెనక్కి తీసుకుంటోందా? అనే చర్చ ప్రజల్లో మొదలైంది.

వివరాలు 

ఏటా రూ.23 వేల కోట్ల విద్యుత్ సబ్సిడీ భారం

ఉచిత విద్యుత్ సబ్సిడీని వదులుకోవాలని ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిపై ప్రజల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

కొందరు ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తుండగా, మరికొందరు ఎన్నికల హామీ అమలుపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.

ADVERTISEMENT