Nagpur rescue centre: మహారాష్ట్రలో బర్డ్ ఫ్లూ కలకలం.. మూడు పులులు, చిరుత మృతి
ఈ వార్తాకథనం ఏంటి
మహారాష్ట్రలోని నాగ్‌పూర్ గోరెవాడ రెస్క్యూ సెంటర్‌లో మూడు పులులు, ఒక చిరుత బర్డ్ ఫ్లూ కారణంగా మరణించాయి.
డిసెంబర్ 2024లో ఈ మరణాల తర్వాత మహారాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా రెడ్ అలర్ట్‌ను ప్రకటించింది. బర్డ్ ఫ్లూ సోకిన పులులను చంద్రపూర్ నుంచి గోరెవాడకు తరలించినట్లు అధికారులు వెల్లడించారు.
డిసెంబర్ 20న ఒక పులి, డిసెంబర్ 23న మరో రెండు పులులు చనిపోయాయి. ఈ జంతువుల మరణాల తర్వాత సేకరించిన శాంపిల్స్‌ను భోపాల్‌లోని ఐసీఏఆర్-నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్‌కి పరీక్షల కోసం పంపించారు.
జనవరి 1న వచ్చిన ల్యాబ్ ఫలితాల్లో బర్డ్ ఫ్లూ కారణంగానే పులులు, చిరుత మరణించినట్లు నిర్ధారణ అయ్యింది.
Details
వన్యప్రాణుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ
రెస్క్యూ సెంటర్‌లోని మిగతా 26 చిరుతలు, 12 పులులకు పరీక్షలు నిర్వహించగా, అవి పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
నిపుణుల అభిప్రాయం ప్రకారం, బర్డ్ ఫ్లూ సోకిన ఆహారం లేదా పచ్చి మాంసం తినడం వల్ల ఈ వైరస్ జంతువులకు సంక్రమించినట్లు భావిస్తున్నారు.
మరణాల అనంతరం కేంద్రం పరిధిలో ఉన్న వన్యప్రాణుల ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. బర్డ్ ఫ్లూ వ్యాప్తి రాకుండా, భద్రతా నిబంధనలు కఠినతరం చేయాలని అధికారులు సూచించారు.
రెస్క్యూ సెంటర్ యాజమాన్యం, అటవీ శాఖ అధికారులు బర్డ్ ఫ్లూ సోకిన ఆహారం సరఫరాపై మరింత నిఘా పెట్టాలని నిర్ణయించారు
. పర్యావరణ పరిరక్షణ చర్యలతో పాటు జంతువుల ఆరోగ్య భద్రతపై మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నారు.