BJP Leader Satyakumar: బీజేపీ నేత సత్యకుమార్‌కు కీలక బాధ్యత.. దక్షిణాది రాష్ట్రాలకు ఇన్‌ఛార్జిగా నియామకం
వ్రాసిన వారు
Sirish Praharaju
Sep 02, 2026
12:40 pm
ఈ వార్తాకథనం ఏంటి
బీజేపీ జాతీయ నేత, ఏపీ మంత్రి సత్యకుమార్ యాదవ్‌కు పార్టీ అధిష్ఠానం కీలక బాధ్యతలు అప్పగించింది. దేశవ్యాప్తంగా నిర్వహించనున్న 'సేవా సంకల్ప్ అభియాన్' కార్యక్రమాలకు సంబంధించి దక్షిణాది రాష్ట్రాల ఇన్‌ఛార్జిగా ఆయనను నియమించింది. ప్రధాని నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవను పురస్కరించుకుని భాజపా ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నెల రోజులపాటు 'సేవా సంకల్ప్ అభియాన్' కార్యక్రమాలను నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబరు 17 వరకు ఈ కార్యక్రమాలు కొనసాగనున్నాయి. భాజపా, ఎన్డీయే ప్రభుత్వాల ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమాల నిర్వహణను సమన్వయం చేసే బాధ్యతను సత్యకుమార్ యాదవ్‌కు పార్టీ అప్పగించింది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో జరిగే సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమాలకు ఆయన ఇన్‌ఛార్జిగా వ్యవహరించనున్నారు.