
Sujana Chowdary: లండన్ పర్యటనలో బీజేపీ నేత సుజనా చౌదరికి తీవ్ర గాయం
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ బీజేపీ సీనియర్ నేత, విజయవాడ వెస్ట్ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరికి లండన్ పర్యటనలో తీవ్ర గాయమైంది.
ఆయన అక్కడ బాత్రూమ్‌లో జారిపడి కుడి చేయికి గాయమై, ఎముక విరిగినట్టు తెలుస్తోంది.
ప్రమాదం అనంతరం లండన్‌లో ప్రాథమిక చికిత్స తీసుకున్న ఆయనను మెరుగైన వైద్య సేవల కోసం వెంటనే హైదరాబాద్‌కు తరలించారు.
తెల్లవారుజామున 3 గంటల సమయంలో శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న సుజనా చౌదరిని, అక్కడి నుంచి బేగంపేటలోని కిమ్స్ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినట్టు సమాచారం.
Details
ఆందోళన వ్యక్తం చేస్తున్న అభిమానులు
ఇక సుజనా చౌదరి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం స్థిరంగా ఉన్నట్టు తెలుస్తోంది. సర్జరీ కోసం ఆయనను ఆసుపత్రిలో చేర్చినట్టు బీజేపీ వర్గాలు పేర్కొన్నాయి.
మరోవైపు ఈ ప్రమాదం లండన్‌లోని ఓ సూపర్ మార్కెట్‌లో చోటు చేసుకున్నదని, అక్కడ కిందపడి ఆయన కుడి భుజానికి బలమైన గాయం అయినట్లు కూడా సమాచారం అందుతోంది.
ఈ విషయం తెలుసుకున్న బీజేపీ శ్రేణులు, సుజనా చౌదరి అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అయితే, సుజనా చౌదరి ఆరోగ్య పరిస్థితిపై ఆసుపత్రి నుంచి అధికారిక హెల్త్ బులిటెన్ విడుదలైతే పూర్తి స్థాయిలో వివరాలు తెలుస్తాయని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.