Suresh gopi: కేరళలో బీజేపీ బోణి.. మళయాళ నటుడు సురేష్ గోపి విజయం
ప్రముఖ మలయాళ నటుడు, భారతీయ జనతా పార్టీ అభ్యర్థి సురేష్ గోపి కేరళలోని త్రిసూర్ నియోజకవర్గం నుంచి లోక్‌సభ ఎన్నికల్లో ముందంజలో ఉన్నారు. భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) వెబ్‌సైట్ ప్రకారం,గోపి 73,120 ఓట్ల తేడాతో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా(సి.పి.ఐ) అభ్యర్థి సునీల్‌కుమార్‌పై ఆధిక్యంలో ఉన్నారు. బిజెపికి, ఈ విజయం కీలకం కావచ్చు. ఇప్పటివరకు పార్టీకి అంతుచిక్కని రాష్ట్రమైన కేరళలో ఆ పార్టీ లోక్‌సభ స్థానాన్ని గెలుచుకోవడం ఇదే మొదటిసారి.
రాజకీయ చరిత్ర
ఏప్రిల్ 2016లో రాష్ట్రపతి రాజ్యసభ సభ్యునిగా నామినేట్ చేశారు. దాంతో గోపీ రాజకీయ జీవితం ప్రారంభమైంది. ఆ ఏడాది చివర్లో అధికారికంగా బీజేపీలో చేరి, తన పదవీ కాలంలో వివిధ కమిటీల్లో పనిచేశారు. 2019 లోక్‌సభ ఎన్నికలలో ఓడిపోయినప్పటికీ, గోపి అభ్యర్థిత్వం బిజెపి ఓట్ల వాటాను 11.1% నుండి 28.2%కి పెంచింది. 2023లో గోపీని వివాదాలు చుట్టుముట్టాయి 2023లో, మహిళా రిపోర్టర్‌ను అనుచితంగా తాకినట్లు ఆరోపణలువచ్చాయి. ఆ తర్వాత ఫేస్‌బుక్‌లో క్షమాపణలు చెప్పారు. ఆమెను తండ్రి వాత్సల్యంతో హత్తుకున్నాను. కానీ నేను అనుచితంగా ప్రవర్తిస్తున్నానని,భావిస్తే ఆమె మనోభావాలను గౌరవిస్తాను. నా ప్రవర్తన ఆమెను బాధపెడితే, దానికి క్షమాపణలు చెబుతున్నాను" అని పేర్కొన్నారు.