Page Loader
రాజాసింగ్‌పై సస్పెన్షన్‌ వేటును బీజేపీ త్వరలో ఉపసంహరించుకుంటుంది: కిషన్ రెడ్డి
రాజాసింగ్‌పై సస్పెన్షన్‌ వేటును బీజేపీ త్వరలో ఉపసంహరించుకుంటుంది: కిషన్ రెడ్డి

రాజాసింగ్‌పై సస్పెన్షన్‌ వేటును బీజేపీ త్వరలో ఉపసంహరించుకుంటుంది: కిషన్ రెడ్డి

వ్రాసిన వారు Stalin
May 15, 2023
06:47 pm

ఈ వార్తాకథనం ఏంటి

బీజేపీ నుంచి సస్పెన్షన్‌కు గురైన గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ త్వరలో తిరిగి పార్టీలో చేరుతారని కేంద్ర మంత్రి, సికింద్రాబాద్ ఎంపీ జి.కిషన్ రెడ్డి తెలిపారు. రాజా సింగ్‌పై సస్పెన్షన్‌ వేటును ఉపసంహరించుకునే ప్రక్రియపై అందరం చర్చిస్తున్నట్లు కిషన్ రెడ్డి పేర్కొన్నారు. అయితే అంతిమంగా బీజేపీ హైకమాండ్ తుది నిర్ణయం తీసుకుంటుందని ఆయన వెల్లడించారు. టి. రాజా‌సింగ్‌పై సస్పెన్షన్‌ వేటును ఉపసంహరించే సమావేశంలో తాను కూడా పాల్గొంటానని, దీనిపై అన్ని ఆలోచించిన హై కమాండ్ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.

రాజాసింగ్

పీడీ చట్టం కింద రాజాసింగ్ అరెస్టు

గత ఏడాది ఆగస్టులో ముహమ్మద్ ప్రవక్తపై అవమానకరమైన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో గోషామహల్ ఎమ్మెల్యే, సింగ్‌ బీజేపీ నుంచి సస్పెండ్ అయ్యారు. ఈ వ్యవహారంలో రాజా సింగ్‌ను ప్రివెంటివ్ డిటెన్షన్ (పీడీ) చట్టం కింద హైదరాబాద్ పోలీసులు అరెస్టు కూడా చేశారు. ప్రస్తుతం రాజాసింగ్ బెయిల్ పై బయట ఉన్నారు. అయినా రాజాసింగ్ తన రెచ్చగొట్టే ప్రసంగాలను వీడటం లేదు. సుదర్శన్ న్యూస్ ఎడిటర్ సురేశ్ చవాన్‌కేతో రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. వీరిద్దరిపై మహారాష్ట్రలో కేసులు నమోదు కూడా అయ్యాయి.