BJP: లోక్‌సభ ఎన్నికలపై బీజేపీ ఫోకస్.. ఫిబ్రవరి 4 నుంచి 'గావో చలో అభియాన్'
ఈ వార్తాకథనం ఏంటి
మరికొన్ని వారాల్లో సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికలపై బీజేపీ స్పషల్ ఫోకస్ పెట్టింది.
ఫిబ్రవరి 4 నుంచి 11 వరకు 'గావో చలో అభియాన్' చేపట్టాలని నిర్ణయించింది.
ఈ కార్యక్రమానికి సంబంధించిన బాధ్యులను పార్టీ నియమించింది.
దాదాపు 7 లక్షల గ్రామాలు, నగరాల్లోని అన్ని బూత్‌లలో నాయకులు 24 గంటలు గడిపేలా కార్యచరణను రూపొందించారు.
'గావో చలో అభియాన్' ప్రోగ్రామ్‌లో భాగంగా కేంద్రంలోని మోదీ చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించే వివరించే బాధ్యతలను నాయకులకు అప్పగించారు.
బీజేపీ
ప్రత్యేక బృందం ఏర్పాటు
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో 'గావో చలో అభియాన్' కార్యక్రమం ప్రజల్లో బీజేపీపై నమ్మకాన్ని పెంచుతుందని పార్టీ కేంద్ర నాయకత్వం భావిస్తోంది.
స్థానిక పార్టీ కేడర్ తమ ప్రధాన ఓటర్లకు మించి ప్రజలకు చేరువయ్యే లక్ష్యంతో పార్టీ పలు ప్రణాళికలతో ముందుకెళ్తోంది.
అందులో భాగంగానే 'గావో చలో అభియాన్' కార్యక్రమానికి పిలుపునిచ్చింది.
'గావ్ చలో అభియాన్' కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయనున్నారు.
జనవరి 20లోగా టీమ్‌ను ఏర్పాటు చేసి, జనవరి 28లోగా శిక్షణ ఇప్పించాలని కేంద్ర నాయకత్వం ఆదేశించింది.
రాష్ట్రం, జిల్లా, డివిజన్, గ్రామం అనే నాలుగు-స్థాయి గ్రూపులను ఏర్పాటు చేయాలని అన్ని రాష్ట్రాల శాఖలకు ఇప్పటికే సూచించింది.