
Threats to RBI : ఆర్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐలకు బాంబు బెదిరింపులు
ఈ వార్తాకథనం ఏంటి
RBI receives email threatening bomb attack: దేశంలోని ప్రధాన బ్యాంకులపై బాంబుదాడి చేస్తామని మంగళవారం ఆర్‌బీఐకి బెదిరింపు మెయిల్ రావడం సంచలనంగా మారింది.
ఆర్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ కార్యాలయాలపై బాంబు దాడి చేస్తామని ఆ మెయిల్‌లో ఉందని ముంబై పోలీసులు తెలిపారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ రాజీనామా చేయాలని బెదిరింపు మెయిల్ పంపిన వ్యక్తి డిమాండ్ చేశారు.
మంగళవారం మధ్యాహ్నం 1:30 గంటలకు ముంబైలోని 11 చోట్ల మొత్తం 11 బాంబు దాడులు జరుగుతాయని మెయిల్‌లో దుండగులు బెదిరించారు.
మెయిల్‌లో పేర్కొన్న అన్ని ప్రాంతాలకు వెళ్లి విచారించినా ఏమీ కనిపించలేదని ముంబై పోలీసులు తెలిపారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
బాంబు బెదిరింపును ధృవీకరించిన ముంబై పోలీసులు
BREAKING | RBI, Two Other Banks In Mumbai Receive Bomb Threat Emailhttps://t.co/9CNn2mHhFV
— TIMES NOW (@TimesNow) December 26, 2023