బీఎస్ 3, బీఎస్ 4 వాహనాలను బ్యాన్ చేయాలి.. కేంద్రాన్ని కోరిన పర్యావరణ మంత్రి
దేశ రాజధాని దిల్లీలో కాలుష్యం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అక్కడ కాలుష్యాన్ని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా అవి తాత్కాలికంగానే మారుతున్నాయి. తాజాగా హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ పరిధిలోని నేషనల్ క్యాపిటల్ రీజియన్ (NRC)లో నాసిరకం డీజల్‌తో నడిచే బస్సులపై కఠిన నిషేధం విధించాలని కేంద్ర ప్రభుత్వాన్ని పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ కోరారు. ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్(AQI) క్రమంగా దిగజారుతోందని ఆయన వాపోయారు. ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడం, గాలి వేగం తక్కువగా ఉండడం, పక్కనే ఉన్న రాష్ట్రాల్లో పొట్టును కాల్చే సమయంలో విడుదలయ్యే కార్బన్ డై ఆక్సైడ్, పర్టిక్యులేట్ మ్యాటర్(PM), కార్బన్ మోనాక్సైడ్ తదితర వాయువుల వల్ల ప్రజలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని తెలిపారు.
నవంబర్ 1 నుంచి ఎలక్ట్రికల్, సీఎన్జీ బస్సులకు మాత్రమే అనుమతి
దిల్లీ పరిధిలోని బస్సులన్నీ సీఎన్జీ, విద్యుత్ పైనా నడుస్తున్నాయని, హర్యానా, యూపీ, రాజస్థాన్ లలోని ఎన్సీఆర్ రీజయన్‌లో బీఎస్ 3, బీఎస్ 4 మోడల్ వాహనాలు ఇంకా నడస్తున్నాయని రాయ్ చెప్పారు. కాశ్మీర్ గేట్ ఇంటర్ స్టేట్ బస్ టెర్నినల్ వద్ద తాను నిర్వహించిన తనిఖీలోనూ ఈ విషయం బయటపడిందన్నారు. దిల్లీలో కాలుష్యం తగ్గించాలని భావిస్తే వెంటనే ఇక్కడ బీఎస్ 3, బీఎస్ 4 మోడల్ వాహనాలను బ్యాన్ చేయాలని ఆయన కేంద్రాన్ని కేంద్రాన్ని కోరు. ఇక నవంబర్ 1 నుంచి ఎలక్ట్రిక్, సీఎన్జీ, బీఎస్ 6 మోడళ్ల డీజల్ బస్సులు మాత్రమే ఎన్సీఆర్ ప్రాంతాల్లో రాకపోకలు కొనసాగించాలని ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ ఇప్పటికే అదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.