Singareni: సింగరేణి సీఎండీగా బుద్ధప్రకాశ్ బాధ్యతల స్వీకరణ
వ్రాసిన వారు
Sirish Praharaju
Feb 13, 2026
02:20 pm
ఈ వార్తాకథనం ఏంటి
సింగరేణి సంస్థ కొత్త సీఎండీగా సీనియర్ ఐఏఎస్ అధికారి డాక్టర్ జ్యోతి బుద్ధప్రకాశ్ గురువారం అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. ఉదయం సింగరేణి జీఎం తాడబోయిన శ్రీనివాస్ ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం సీఎండీ హోదాలో బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ జ్యోతి బుద్ధప్రకాశ్ సింగరేణి సంస్థ కార్యకలాపాలు, ఇప్పటివరకు సాధించిన ప్రగతిపై సమగ్రంగా సమీక్షించారు. ఈ సమావేశంలో ఉన్నతాధికారులు ఎల్.వి. సూర్యనారాయణ, కె. వెంకటేశ్వర్లు, గౌతం, బి. వెంకన్న తదితరులు పాల్గొన్నారు.