Page Loader
AP Budget Session: ఏపీలో ఫిబ్రవరిలో బడ్జెట్ సమావేశాలు.. కూటమి సర్కార్ ప్రణాళికలు ఏమిటి?
ఏపీలో ఫిబ్రవరిలో బడ్జెట్ సమావేశాలు.. కూటమి సర్కార్ ప్రణాళికలు ఏమిటి?

AP Budget Session: ఏపీలో ఫిబ్రవరిలో బడ్జెట్ సమావేశాలు.. కూటమి సర్కార్ ప్రణాళికలు ఏమిటి?

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 29, 2025
02:43 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బడ్జెట్ సమావేశాల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తోంది. వచ్చే నెల మూడో వారంలో ఏపీ బడ్జెట్ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే వివిధ శాఖల నుంచి వచ్చిన ప్రతిపాదనలపై ఆర్థిక శాఖ సమీక్ష నిర్వహిస్తోంది. బడ్జెట్ అంచనాలపై రెండు రోజుల్లో ఆర్థిక శాఖ మొదటి సమావేశాన్ని నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 కేంద్ర బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. అదే నెలలో ఏపీ బడ్జెట్ 2025-26ను కూడా ప్రవేశపెట్టే అవకాశముంది.

Details

త్వరలోనే ప్రణాళికలు వెల్లడి

ఏప్రిల్ 1 నుంచి ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన అన్ని కార్యకలాపాలను ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రవేశపెట్టే ఇదే మొదటి పూర్తి స్థాయి బడ్జెట్ కావడంతో ఇది ప్రాధాన్యత సంతరించుకుంది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు కోసం ఏ శాఖలకు ఎన్ని నిధులు కేటాయిస్తారో అన్నది ఆసక్తికరంగా మారింది. ప్రభుత్వ ప్రణాళికలు త్వరలో వెల్లడయ్యే అవకాశముంది.