Parliament Budget Session: జనవరి 31- ఫిబ్రవరి 9 వరకు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు
ఈ వార్తాకథనం ఏంటి
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 31 నుంచి ఫిబ్రవరి 9 వరకు జరగనున్నాయి.
2024-25 ఆర్థిక సంవత్సరం కోసం మధ్యంతర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న సమర్పించనున్నారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జనవరి 31న బడ్జెట్ సమావేశాలను ప్రారంభిస్తూ పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
మధ్యంతర బడ్జెట్‌లో మహిళా రైతులకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధిని రెట్టింపు చేసే ప్రతిపాదన కూడా ఉండవచ్చని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
ఏప్రిల్-మేలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కేంద్రం కొన్ని ఆకర్షించే నిర్ణయాలను బడ్జెట్ సమావేశాల్లో తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఫిబ్రవరి 1న బడ్జెట్
Budget session of Parliament to commence on January 31 and continue till February 9; interim budget for FY25 to be presented by Finance Minister Nirmala Sitharaman on February 1 pic.twitter.com/JntOx0BVUJ
— OTV (@otvnews) January 11, 2024