Page Loader
Bunty Bains : ప్రముఖ పంజాబీ గీత రచయిత బంటీ బెయిన్స్‌పై హత్యాయత్నం
Bunty Bains : ప్రముఖ పంజాబీ గీత రచయిత బంటీ బెయిన్స్‌పై హత్యాయత్నం

Bunty Bains : ప్రముఖ పంజాబీ గీత రచయిత బంటీ బెయిన్స్‌పై హత్యాయత్నం

వ్రాసిన వారు Stalin
Feb 27, 2024
04:41 pm

ఈ వార్తాకథనం ఏంటి

Bunty Bains: ప్రముఖ పంజాబీ సంగీత స్వరకర్త, నిర్మాత, దివంగత గాయకుడు సిద్ధూ మూసేవాలాకు అత్యంత సన్నిహితుడైన బంటీ బెయిన్స్‌పై మంగళవారం కొందరు దుండగులు కాల్పులు జరిపారు. పంజాబ్‌లోని మొహాలీలోని సెక్టార్-79లో ఈ దాడి జరిగింది. అయితే, ఈ దాడిలో బంటీకి ఏమీ జరగలేదు. తృటిలో అతను ప్రాణాలతో బయటపడ్డాడు. మొహాలీలోని ఓ రెస్టారెంట్‌లో కూర్చున్న అతనిపై దాడి జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. 2022లో సిద్ధూ మూసేవాలా పట్టపగలు హత్య చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత హనీ సింగ్‌తో సహా చాలామంది పంజాబీ గాయకులను గ్యాంగ్‌స్టర్లు బెదిరించారు. అనేక మందిపై దాడి చేశారు. ఇప్పుడు ఆ జాబితాలో బంటీ బెయిన్స్‌ చేరడం గమనార్హం. మూసేవాలాకు సంబంధించిన అనేక పాటలను బెయిన్స్‌ స్వరపరిచి..నిర్మించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

కాల్పులు జరిపిన దృశ్యాలు