Page Loader
UP man hacks: మహ్మద్ ప్రవక్తను కించపర్చాడని కండక్టర్‌ను కత్తితో పొడిచిన విద్యార్థి 
UP man hacks: మహ్మద్ ప్రవక్తను కించపర్చాడని కండక్టర్‌ను కత్తితో పొడిచిన విద్యార్థి

UP man hacks: మహ్మద్ ప్రవక్తను కించపర్చాడని కండక్టర్‌ను కత్తితో పొడిచిన విద్యార్థి 

వ్రాసిన వారు Stalin
Nov 25, 2023
10:56 am

ఈ వార్తాకథనం ఏంటి

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో దారుణం జరిగింది. మహ్మద్ ప్రవక్తను కించపర్చాడని కండక్టర్‌ను ఓ విదార్థి కత్తితో పొడిచాడు. గాయపడిన కండక్టర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న లౌరేబ్ హష్మీ, కండక్టర్ విశ్వకర్మతో బస్సు టికెట్ ధర విషయమై వాగ్వాదానికి దిగాడు. వాదనల మధ్య హష్మీ ఒక్కసారిగా కండక్టర్‌పై దాడి చేశాడు. క్లీవర్ (పదునైన కత్తి)తో అతనిపై దాడి చేశాడు. కండక్టర్ మెడ, అతని శరీరంలోని ఇతర భాగాలలో పొడిచి, బస్సు నుంచి దూకి కళాశాల క్యాంపస్‌కు వెళ్లాడు.

యూపీ

నిందితుడిపై పోలీసుల కాల్పులు

కాలేజీ క్యాంపస్‌లోకి ప్రవేశించిన తర్వాత హష్మీ తన మొబైల్‌లో వీడియో తీసి నేరం చేసినట్లు అంగీకరించాడు. బస్ కండక్టర్ దైవ దూషణ చేశాడని, ప్రవక్త మహమ్మద్‌ను అవమానించాడని ఆరోపిస్తూ వీడియోను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశాడు. నిందితుడు తన వీడియోలో ప్రధాని నరేంద్ర మోదీ, యోగి ఆదిత్యనాథ్ పేర్లను ప్రస్తావించిచడం గమనార్హం. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని పట్టుకునేందుకు కాలేజీ లోపలికి వెళ్లారు. ఈ సమయంలో, నిందితుడు పారిపోయేందుకు ప్రయత్నించాడు. దీంతో పోలీసులు అతని కాలికి కాల్చారు. వెంటనే అతన్ని అదుపులోకి తీసుకొని.. అతను ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతన్ని పోలీసులు ఆస్పత్రికి తరలించారు.