
Akhilesh Yadav: అక్రమ మైనింగ్ కేసులో అఖిలేష్ యాదవ్‌కు సీబీఐ సమన్లు
ఈ వార్తాకథనం ఏంటి
ఉత్తర్‌ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్‌ను కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ విచారణకు పిలిచింది.
గురువారం విచారణలో పాల్గొనాల్సిందిగా అఖిలేష్ యాదవ్‌కు సీబీఐ సమన్లు జారీ చేసింది.
అక్రమ మైనింగ్ కుంభకోణం కేసులో ఈ సమన్లు జారీ అయ్యాయి. అక్రమ మైనింగ్ కేసులో సాక్షిగా అఖిలేష్ యాదవ్ సీబీఐ ఎదుట హాజరుకావాల్సి ఉంది.
దీంతో ఈ కేసులో ఫిబ్రవరి 29న అఖిలేష్ యాదవ్ వాంగ్మూలం ఇవ్వాల్సి ఉంటుంది.
లోక్‌సభ ఎన్నికల వేళ.. అఖిలేష్ యాదవ్‌కు సీబీఐ సమన్లు పంపడంతో ఉత్తరప్రదేశ్‌లో రాజకీయ వాతావరణం వేడెక్కింది.
ప్రభుత్వ ఉద్యోగులు టెండర్ల ప్రక్రియను పాటించకుండా అక్రమంగా కొత్త లీజులు జారీ చేశారని సీబీఐ అభియోగాలు మోపింది.
అఖిలేష్
అఖిలేష్ యాదవ్ ప్రభుత్వ హయాంలో అక్రమ మైనింగ్ వ్యవహారం
అఖిలేష్ యాదవ్ ప్రభుత్వ హయాంలోని 2012 నుంచి 2016 మధ్య హమీర్‌పూర్‌లో అక్రమ మైనింగ్ కేసు వెలుగులోకి వచ్చింది.
ఈ వ్యవహారంపై 2019 జనవరిలో సీబీఐ కేసు నమోదు చేసింది. ఇప్పుడు ఈ కేసులో అప్పటి సీఎం అఖిలేష్ యాదవ్‌ను హాజరు కావాలని సీబీఐ కోరింది.
జనవరి 2019లో అప్పటి జిల్లా కలెక్టర్, మైనింగ్ అధికారి, ఇతరులతో సహా పలువురు ప్రభుత్వ ఉద్యోగులపై ఎఫ్ఐఆర్ నమోదైంది.
ఈ ఎఫ్‌ఐఆర్‌లో హమీర్‌పూర్‌లో ఖనిజాల అక్రమ తవ్వకాలను ప్రభుత్వ ఉద్యోగులు అనుమతించారని సీబీఐ అభియోగాలు మోపింది.
ఈ కేసుకు సంబంధించిన కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి అఖిలేష్ యాదవ్ సీబీఐ ముందు హాజరుకావాలని పేర్కొంది.