అఖిలేష్ యాదవ్: వార్తలు

రూ.20 లక్షల లంచం అడిగిన ఐపీఎస్; వీడియో షేర్ చేసిన అఖిలేష్ యాదవ్

ఉత్తర్‌ప్రదేశ్ ఒక వ్యాపారవేత్త నుంచి డబ్బు డిమాండ్ చేస్తున్న ఐపీఎస్ అధికారి వీడియోను సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ట్వీట్ చేశారు. ఆ అధికారిపై 'బుల్‌డోజర్' ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా? అని సీఎం యోగి ఆదిత్యనాథ్ ను ప్రశ్నించారు. దీంతో ప్రభుత్వం వెంటనే ఆ వీడియో దర్యాప్తునకు ఆదేశించింది.

యోగి ఆదిత్యనాథ్ వర్సెస్ అఖిలేష్ యాదవ్: యూపీలో శాంతి‌భద్రతలపై అసెంబ్లీలో డైలాగ్ వార్

2005లో హత్యకు గురైన బహుజన్ సమాజ్ పార్టీ ఎమ్మెల్యే రాజుపాల్ కేసులో ప్రధాన సాక్షి ఉమేష్ పాల్‌ను ప్రయాగ్‌రాజ్‌లో శుక్రవారం దుండగులు హతమార్చారు. ఈ అంశంపై ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో సీఎం యోగి ఆదిత్యనాథ్, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ మధ్య డైలాగ్ వార్ నడిచింది.

కేసీఆర్ మాకు పెద్దన్నలాంటి వారు: దిల్లీ సీఎం కేజ్రీవాల్

భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్‌పై దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, కేరళ సీఎం పినరయి విజయన్, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా ప్రశంసలు కురించారు. కేసీఆర్ తమకు పెద్దన్న లాంటి వారని కేజ్రీవాల్ అభివర్ణించారు. ఇక్కడి పథకాలు అద్భుతమని, కంటి వెలుగు పథకాన్ని దిల్లీ, పంజాబ్ లలో అమలు చేస్తామని ప్రకటించారు.