Page Loader
Lok Sabha polls: మరో 11 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన అఖిలేష్ 
Lok Sabha polls: మరో 11 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన అఖిలేష్

Lok Sabha polls: మరో 11 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన అఖిలేష్ 

వ్రాసిన వారు Stalin
Feb 19, 2024
05:28 pm

ఈ వార్తాకథనం ఏంటి

రానున్న లోక్‌సభ ఎన్నికలకు సమాజ్‌వాదీ పార్టీ మరో 11మంది అభ్యర్థులను ప్రకటించింది. రెండో జాబితాలో ముజఫర్‌నగర్, ఘాజీపూర్ వంటి ముఖ్యమైన లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. ముజఫర్‌నగర్‌ నుంచి హరేంద్ర మాలిక్‌కు, ఘాజీపూర్‌ నుంచి ముఖ్తార్‌ అన్సారీ సోదరుడు అఫ్జల్‌ అన్సారీకి టికెట్‌ ఇచ్చారు. షాజహాన్‌పూర్‌ నుంచి రాజేష్‌ కశ్యప్‌, హర్దోయ్‌ నుంచి ఉషా వర్మ, మిస్రిఖ్‌ లోక్‌సభ స్థానం నుంచి రాంపాల్‌ రాజ్‌వంశీకి అవకాశం కల్పించారు. ఎస్పీ జనవరి 30న తొలి జాబితాను విడుదల చేసింది. అందులో 16మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. రెండో జాబితాలో 11మందికి అఖిలేష్ యాదవ్ సీట్లను కేటాయిచారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో 80లోక్‌సభ స్థానాలు ఉండగా.. ఇప్పటి వరకు 27స్థానాలకు సమాజ్‌వాదీ పార్టీ తమ అభ్యర్థులను ఖరారు చేసింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

సమాజ్‌వాదీ పార్టీ విడుదల చేసిన రెండో జాబితా