భారత రాష్ట్ర సమితి/ బీఆర్ఎస్: వార్తలు

దిల్లీ మద్యం కేసు: అన్ని ఫోన్లను ఈడీకి సమర్పించిన కవిత; అధికారులకు లేఖ

ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించిన కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కార్యాలయంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితను మంగళవారం అధికారులు విచారిస్తున్నారు. మూడో దఫా విచారణలో భాగంగా కవిత ఇప్పటి వరకు తాను ఉపయోగించిన అన్ని ఫోన్లను ఈడీకి సమర్పించారు.

గుజరాత్‌లో 13సార్లు ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయ్: సంజయ్‌పై కేటీఆర్ ఫైర్

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్( టీఎస్‌పీఎస్‌సీ) పేపర్ల లీకేజీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తొలిసారి స్పందించారు. ఈ కేసులోని నిందితులు బీజేపీ యాక్టివ్ కార్యకర్తలని కేటీఆర్ అన్నారు. పేపర్ల లీకేజీ వ్యవహారం బీజేపీ చేసిన కుట్రగా అభివర్ణించారు.

15 Mar 2023

తెలంగాణ

మార్చి 26న మహారాష్ట్రలో బీఆర్ఎస్ బహిరంగ సభ; సీఎం కేసీఆర్ హాజరు

మహారాష్ట్రలోని కందర్ లోహాలో మార్చి 26న జరిగే భారీ బహిరంగ సభకు భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) జాతీయ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరవుతారని పార్టీ ఈ మేరకు ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సందర్భంగా మహారాష్ట్రలో పెద్ద ఎత్తున నాయకులు, ప్రజలు బీఆర్‌ఎస్‌లో చేరనున్నారు.

దిల్లీలో కవితను ప్రశ్నిస్తున్న ఈడీ; హైదరాబాద్ లో బీజేపీకి వ్యతిరేకంగా వెలసిన పోస్టర్లు

దిల్లీ మద్యం పాలసీ కేసుకు సంబంధించి భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) ఎమ్మెల్సీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవిత శనివారం దిల్లీలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారుల ఎదుట హాజరయ్యారు. ఆమెపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

సర్వేలన్నీ బీఆర్ఎస్‌కే అనుకూలం, డిసెంబర్‌లోనే తెలంగాణలో ఎన్నికలు: సీఎం కేసీఆర్

తెలంగాణలో ముందస్తు ఎన్నికలొస్తాయని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ క్లారిటీ ఇచ్చేశారు. శుక్రవారం ప్రగతి భవన్‌లో జరిగిన బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ నాయకులకు దిశా నిర్దేశం చేశారు.

Women's Reservation Bill: మహిళా రిజర్వేషన్‌‌ను సాధించే వరకూ విశ్రమించేది లేదు: ఎమ్మెల్సీ కవిత

ప్రస్తుత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ, తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు కుమార్తె కవిత శుక్రవారం దిల్లీలోని జంతర్‌ మంతర్ వద్ద ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టారు.

ఏ తప్పూ చేయలేదు, ఈడీ విచారణను ఎదుర్కొంటా: బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత

ఎన్నికలు ఉన్న చోట మోదీ కంటే ముందే ఈడీ చేరిపోతుందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. ఎన్నికలు దగ్గర పడుతున్నందున తెలంగాణలో కూడా కేంద్ర ఏజెన్సీలు దాడులు చేస్తున్నాయని ఆరోపించారు. గురువారం దిల్లీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు.

మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల బరిలో బీఆర్ఎస్; తొలిసారి తెలంగాణ బయట కేసీఆర్ రాజకీయం

తెలంగాణ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. తెలంగాణ కాకుండా ఇతర రాష్ట్రాల్లో సత్తా చాటేందుకు అదును కోసం వేచి చూస్తున్నారు. ఈ నేపథ్యంలో తొలిసారి తెలంగాణ బయట ఎన్నికలకు నాయకత్వం వహించేందుకు సిద్ధమవుతున్నారు.

దిల్లీ మద్యం కేసు: 'సీబీఐ తర్వాత అరెస్టు చేసేది ఎమ్మెల్సీ కవితనే'

దిల్లీ మద్యం కుంభకోణంలో డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్ అంశం తెలుగు రాష్ట్రాలు కూడా చర్చశీయాంశంగా మారింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన కొంతర కీలక నేతలు కూడా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో ఈ కేసు వ్యవహారాన్ని ఇరు రాష్ట్రాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి.

27 Feb 2023

తెలంగాణ

D Srinivas: సీనియర్ నాయకుడు డి. శ్రీనివాస్‌కు తీవ్ర అస్వస్థత

తెలంగాణలో సీనియర్ రాజకీయ నాయకుడు, పీసీసీ మాజీ చీఫ్ డి. శ్రీనివాస్ సోమవారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇంట్లో ఆయన ఫిట్స్ రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే సిటీ న్యూరో ఆస్పత్రికి తరలించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

నమస్తే ఆంధ్రప్రదేశ్‌: ఏపీలో న్యూస్ పేపర్ ఏర్పాటుపై కేసీఆర్ స్పెషల్ ఫోకస్

బీఆర్‌ఎస్‌ను ఆంధ్రప్రదేశ్‌‌లో విస్తరింపజేసేందుకు కేసీఆర్ ప్రత్యేక దృష్టిసారిస్తున్నట్లు కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌‌లో బీఆర్ఎస్ కోసమే సొంతంగా న్యూస్‌పేపర్‌ పెట్టే యోచనలో కేసీఆర్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆ న్యూస్‌పేపర్‌ పేరును కూడా 'నమస్తే ఆంధ్రప్రదేశ్‌'‌గా ఖారారు చేసినట్లు తెలుస్తోంది.

హైదరాబాద్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంఐఎం నేత రహ్మత్ బేగ్‌; మద్దతు ప్రకటించిన బీఆర్ఎస్

త్వరలో జరగనున్న హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి తన అభ్యర్థిని ఏఐఎంఐఎం ప్రకటించింది. తమ పార్టీ అభ్యర్థిగా మీర్జా రహ్మత్ బేగ్‌ను రాబోయే లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎన్నికల్లో పోటీ చేస్తారని ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ మంగళవారం ట్విట్టర్‌లో ప్రకటించారు.

14 Feb 2023

తెలంగాణ

కాంగ్రెస్‌-బీఆర్‌ఎస్‌ పొత్తు; జోస్యం చెప్పిన ఎంపీ కోమటిరెడ్డి

కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి. తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడుతుందని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి జోస్యం చెప్పారు.

08 Feb 2023

దిల్లీ

దిల్లీ మద్యం కేసు: వ్యాపారవేత్త గౌతమ్ మల్హోత్రాను అరెస్టు చేసిన ఈడీ

దిల్లీ మద్యం కేసులో శిరోమణి అకాలీదళ్ మాజీ ఎమ్మెల్యే దీప్ మల్హోత్రా కుమారుడు, ప్రముఖ వ్యాపార వేత్త గౌతమ్ మల్హోత్రాను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అరెస్ట్ చేసింది.

ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్రం ప్రయత్నం: ఎమ్మెల్సీ కవిత

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు.

30 Jan 2023

తెలంగాణ

ఫిబ్రవరి 5న నాందేడ్‌లో బీఆర్ఎస్ సభ, సరిహద్దు ప్రాంతాలపై కేసీఆర్ స్పెషల్ ఫోకస్

భారత రాష్ట్ర సమితి రెండో బహిరంగ సభను మహారాష్ట్రలోని నాందేడ్‌లో నిర్వహించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమాయత్తమవుతున్నారు. ఇప్పటికే బహిరంగ సభ ఏర్పాట్లను పార్టీ ముఖ్య నాయకులకు అప్పగించారు.

27 Jan 2023

తెలంగాణ

ఫిబ్రవరి 5న బీఆర్ఎస్‌లో చేరనున్న ఒడిశా మాజీ సీఎం గిరిధర్ గమాంగ్!

ఒడిశా మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గమాంగ్ తన కుమారుడు శిశిర్‌తో కలిసి బీజేపీని వీడి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నేతృత్వంలోని భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్)లో చేరనున్నట్లు ప్రకటించారు.

కేసీఆర్ మాకు పెద్దన్నలాంటి వారు: దిల్లీ సీఎం కేజ్రీవాల్

భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్‌పై దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, కేరళ సీఎం పినరయి విజయన్, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా ప్రశంసలు కురించారు. కేసీఆర్ తమకు పెద్దన్న లాంటి వారని కేజ్రీవాల్ అభివర్ణించారు. ఇక్కడి పథకాలు అద్భుతమని, కంటి వెలుగు పథకాన్ని దిల్లీ, పంజాబ్ లలో అమలు చేస్తామని ప్రకటించారు.

ప్రగతి భవన్‌లో కేసీఆర్‌ను కలిసిన ఒడిశా మాజీ సీఎం గిరిధర్ గమాంగ్

ఒడిశా మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ పార్లమెంటేరియన్ గిరిధర్ గమాంగ్ శుక్రవారం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావును కలిశారు. ఈ ఇద్దరు రాష్ట్ర, జాతీయ రాజకీయాల గురించి చర్చించారు. ఈ భేటీలో గిరిధర్ కుమారుడు శిశిర్ గమాంగ్ ఉన్నారు.

ఖమ్మంలో బీఆర్ఎస్ తొలి సభ.. ముగ్గురు సీఎంలకు కేసీఆర్ ఆహ్వానం!

టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మార్చిన తర్వాత పార్టీ తొలి బహిరంగ సభను నిర్వహించేందుకు అధినేత కేసీఆర్ సన్నద్ధమవుతున్నారు. వాస్తవానికి తొలి‌సభను దిల్లీలోనే ఏర్పాటు చేయాలని భావించినా.. అది సాధ్యం కాలేదు. దీంతో సభా వేదికను మార్చాలని నిర్ణయించారు.

02 Jan 2023

జనసేన

ఆంధ్రప్రదేశ్‌లో బీఆర్ఎస్ విస్తరణపై కేసీఆర్ ఫోకస్.. పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఆయనకేనా?

ఆంధ్రప్రదేశ్‌లో భారత రాష్ట్ర సమితి విస్తరణపై అధినేత కేసీఆర్ దృష్టి పెట్టారు. వీలైనంత త్వరలో ఏపీలో పార్టీ కార్యాలయాలన్ని ప్రారంభించాలనే ఆలోచనలో ఉన్నారు. ఏపీలో పార్టీని నడిపే నాయకుల జాబితాను ఇప్పటికే ఖరారు చేశారట. కీలక నాయకుల పేర్లు ఇప్పడు బయటకు వచ్చాయి. వీరందరూ సోమవారం కేసీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది.

27 Dec 2022

తెలంగాణ

ఎమ్మెల్యేల ఎర కేసు: అప్పటి వరకు విచారణకు రాలేనంటూ ఈడీకి రోహిత్ రెడ్డి మెయిల్

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల ఎర కేసు కీలక మలుపులు తీరుగుతోంది. తాజాగా ఈ కేసులో తదుపరి విచారణకు రావట్లేదని ఈడీకి రోహిత్ రెడ్డి చెప్పారు. తాను ఎందుకు రావట్లేదో.. మెయిల్ ద్వారా స్పష్టంగా వివరించారు.