
Palvai Sravanthi: కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరిన పాల్వాయి స్రవంతి
ఈ వార్తాకథనం ఏంటి
కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు పాల్వాయి స్రవంతి ఆదివారం బీఆర్ఎస్‌లో చేరారు.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధికార ప్రతినిధి పదవికి స్రవంతి శనివారం రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
తెలంగాణ భవన్‌లో కేటీఆర్ స్రవంతికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా స్రవంతి మాట్లాడుతూ.. తనకు కాంగ్రెస్‌లో తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడం వల్లే రాజీనామా చేసినట్లు స్రవంతి చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ బ్రోకర్ల చేతిలో ఉన్నట్లు అమె పేర్కొన్నారు. బీఆర్ఎస్ అనేది తన కెపాసిటీ, క్యాలిబర్‌ని గుర్తించే ప్రదేశంగా తాను భావిస్తున్నట్లు చెప్పారు.
తాను బీఆర్ఎస్‌లో చేరడం తన కెరీర్‌కు పెద్ద మలుపుగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
స్రవంతిని పార్టీలోకి ఆహ్వానిస్తున్న కేటీఆర్
మునుగోడు కాంగ్రెస్ సీనియర్ నేత పాల్వాయి స్రవంతి రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
— BRS Party (@BRSparty) November 12, 2023
తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి @KTRBRS గారి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.#VoteForCar… pic.twitter.com/kVmEWT3ryn